Home / health / సరిపడా నిద్ర లేకపోతే అనుకున్న మార్కులూ రావు

సరిపడా నిద్ర లేకపోతే అనుకున్న మార్కులూ రావు

Author:

రాత్రిళ్ళు తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేవాలి అనేది మనం చిన్నప్పటినుంచీ వింటున్న సుభాషితమే… కానీ, అందరం దీన్ని పాటించం. ముఖ్యంగా పట్టణాల్లోని పిల్లలు, జనాలు అయితే మరీ దారుణంగా ఏ అర్ద రాత్రో పడుకోవడం.. లేటు గా లేవడం వారికి అలవాటయ్యింది. BPO ఉద్యోగులు, నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారో అంటే సరే తప్పదు. కానీ, స్కూల్ పిల్లలు కూడా ఇలా లేటుగా పడుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు అంటున్నారు పరిశోధకులు. లేటుగా నిద్ర పోవటం వల్ల అనేక సమస్యలు వస్తాయని, ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో వారి మార్కులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారి పరిశోధనలో తేలింది.

good sleep gives good results

అమెరికాలోని హార్వర్డ్‌ కళాశాల నిపుణులు 61 మంది విద్యార్థుల పై 30 రోజులపాటు పరిశోధనలు కొనసాగించారు. పిల్లలు నిద్రపోయే సమయం.. లేచే సమయం తో పాటూ పూర్తి నిద్రా సమయాలను పరిగణలోకి తీసుకున్నారు. వారి వారి నిద్రాసమయాలను బట్టి వారికి మార్కులు ఇచ్చారు. వీటిని విద్యార్థుల మార్కులతో పోల్చగా.. సమయానికి నిద్ర పోనివాళ్ళ కన్నా సరిపడా నిద్రపోయేవాళ్ళకే మార్కుల శాతం ఎక్కువగా ఉండడం గమనించారు. సరిపడా నిద్రపోయే శాతంతో పోలిస్తే.. మార్కుల్లో కూడా సగటున 0.10 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన నిద్ర అలవాట్లు ఉన్నవారికే మంచి మార్కులు వస్తున్నట్లు స్పష్టంగా రుజువైంది.

దీనికి ప్రధాన కారణం నిద్ర హార్మోన్‌ మెలటోనిన్‌ ఆలస్యంగా విడుదల కావడమేనని కోడా పరిశోధకులు కనిపెట్టారు. మన నిద్ర పోయే సమయాలు అస్తవ్యస్తంగా ఉంటే.. మెలటోనిన్‌ విడుదల కూడా మరింత ఆలస్యమవుతుంది. ఫలితంగా మన బయలాజికల్ క్లాక్ దెబ్బతిని, శరీరంతోపాటు మెదడుపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. రాత్రి పొద్దుపోయే వరకూ చదువుకున్నా.. అర్ధరాత్రి దాటినా ఫోన్లల్లో గేములు గట్రా ఆడుతున్నా.. నిద్ర హార్మోన్లలో అసమతుల్యతకు దారి తీస్తుందట. అంతేకాదు, లేటు నిద్ర వల్ల ఇంట్లో లైట్లు కావచ్చు, మొబైల్, లాప్ టాప్ ల లైట్లు కావచ్చు.. రాత్రి పూట ఎక్కువ కాంతి వెదజల్లడం కూడా పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లలకు కచ్చితంగా సరిపడా నిద్ర ఉండాల్సిందేనట.. తిండితో పాటూ నిద్ర కూడా ఒక నిర్దిష్ట సమయ పాలనతో జరిగితేనే ఆరోగ్యంతో పాటూ మంచి మార్కులు కూడా వస్తాయి.

(Visited 130 times, 1 visits today)