Home / health / పిల్లలు ఎక్కువసేపు టీవీలు, స్మార్ట్ ఫోన్లతోనే గడపడం వాళ్ళ జీవితానికే చాలా ప్రమాదకరం…!

పిల్లలు ఎక్కువసేపు టీవీలు, స్మార్ట్ ఫోన్లతోనే గడపడం వాళ్ళ జీవితానికే చాలా ప్రమాదకరం…!

Author:

టీవీ చూడటం, ఇంటర్నెట్ వాడటం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా కార్టూన్‌ చానెల్స్, ప్లే చానెల్స్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అందులో ఉండే క్యారెక్టర్లను బాగా అనుకరిస్తున్నారు. కొంతమంది పిల్లలు గంటల తరబడి టీవీలకు అతుక్కునిపోతున్నారు. దీని వలన బద్దకం, మందకొడితనం పెరిగిపోతున్నాయి. పిల్లల్ని అలాగే వదిలేస్తే, వారు ఎప్పటికి ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతారు. నలుగురితో కలిసి ఉండటానికి కూడా మొగ్గు చూపరు. చదువుపై కూడా శ్రద్ధ పెట్టకపోవడం జరుగుతుంది. ఈ అలవాటును మెల్ల మెల్లగా తగ్గించాలి. అటువంటి ఛానల్స్‌ను క్రమంగా తగ్గించి వేయాలి.

అటువంటి ఛానెల్స్‌లో ఏ ప్రోగ్రామ్‌‌ను క్రమం తప్పకుండా చూస్తున్నారో గమనించి ఆ సమయంలో వేరే వ్యాపకం అలవాటు చేయటం వంటివి చేయాలి, లేదంటే ఆ కార్యక్రమాలకు అలవాటు పడిపోతే పిల్లలను నియంత్రించండం కష్టతరమవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మీ పిల్లలు రోజు 3 గంటల ఎక్కువగా టీవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్  చూస్తూ ఉంటే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఉంది దీనివలన బరువు పెరగడంతో పాటు ఆకలి, గ్లూకోస్, ఇన్సులిన్ లను నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.

childrens-addict-to-televisions

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించటానికి, పనులు చేయించుకోవటానికి టీవీని అలవాటు చేస్తుంటారు. ఇది సరికాదు. తర్వాత కాలంలో ఈ అలవాటే పిల్లల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. కాబట్టి ముందు నుంచే వాటిని అరికట్టడం మంచిది. ఇలా టీవీ, ఇంటర్నెట్ మరియు వీడియో గేమ్స్ నుండి పిల్లలను దూరం చేయాలంటే వారిని పార్కులకి తీసుకెళ్లడం కానీ, మైదానంలో ఆడిపించటం కానీ చేయాలి. ముఖ్యంగా మైదానంలో ఆడటానికి పిల్లలు ఇష్టపడినట్లైతే టీవీ జోలికి ఎక్కువగా వెళ్ళరు. మైదానంలో ఆటలు ఆడటం వాళ్ళ శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందుతారు.

(Visited 1,260 times, 1 visits today)