Home / Inspiring Stories / చైనా యూనివర్సిటీలో యాంటీ టెర్రరిజం కోర్సులు-భారత్ కూ అవసరమేనా..!?

చైనా యూనివర్సిటీలో యాంటీ టెర్రరిజం కోర్సులు-భారత్ కూ అవసరమేనా..!?

Author:

China opened anti terrorism school

సమాజం లో మార్పులకు అనూకూలంగా కొత్త కొత్త ఇన్వెన్షన్ లు వస్తూనే ఉంటాయి. విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని కొత్త కోర్సుల్ని ప్రారంభిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త గా ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కోవటానికీ, అందులోని మౌళికాంశాల లోని లోపాలనీ, ఉగ్రవాదం ఏర్పడే మూల కారణాలమీద అధ్యయణం కోసం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదం నేపథ్యంలో చైనాలోని ఓ విశ్వవిద్యాలయం కొత్తగా యాంటీ టెర్రరిజం స్కూల్‌ని ప్రారంభించనున్నది. ఈ విషయాన్ని ఆ స్కూలు స్థాపనలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జాంగ్‌ జింగ్‌ పింగ్‌ మీడియాకి వెల్లడించారు. చైనా కమ్యూనిస్ట్ మూలలపై నిలబడ్డ దేశమే అయినా తిరుగు బాటు పోరాటానికీ ఉగ్రవాదానికీ ఉన్న తేడా లని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నది.

అందులో భాగం గానే అక్కడి షాన్‌క్సి రాష్ట్రంలోని నార్త్‌ వెస్ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్సెస్‌ అండ్‌ లా ఈ కోర్సును రూపొందించిందని తెలిపారు. ఈ కోర్సులో చేరేవారికి కౌంటర్‌ టెర్రరిజం, తదితర ప్రత్యేక కోర్సుల్నిప్రవేశ పెడటారట. ఇటీవల కొత్తగా వస్తున్న ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతాలు, ఈ దిశగా అమలవుతున్న పద్ధతులు తదితరాల్ని వారికి తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం ఈ స్కూలులో అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరే వారి కోసం అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. తర్వాత మాస్టర్స్‌ డిగ్రీ, డాక్టరేట్‌లు కూడా ఇస్తారట. ఉగ్రవాదమూ, తిరుగుబాటు ఉధ్యమ పోరాటమూ ఒకటి కాదని చెప్పటమూ. ఉగ్రవాద వ్యతిరేక ఉధ్యమాల నిర్మాణమూ ఈ యాంటీ టెర్రరిజం కోర్సుల ముఖ్య ఉద్దేశాలు.

నిజానికి అగ్రరాజ్య పోకడలవల్లనే ఉగ్రవాదం మరింత ప్రబలుతోందన్నది అందరూ ఒప్పుకుంటున్న విశయమే కానీ ఆయాదేశాల ఆర్థిక, రాజకీయాంశాల పరంగా ఎవరూ పూర్తి వ్యతిరేకతని ఈ పెద్ద దేశాలమీద చూపించకపోగా, ఉగ్రవాద పీడిత దేశాలమీదనే తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యం లో భారత వైకరినే పరిశీలిస్తే అమెరికాకి ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ప్రపంచ సమస్యగా మార్చి వేస్తుంది. ఎయిడ్స్, టెర్రరిజం అలాంటి సమస్యలే. ప్రపంచంలో టెర్రరిజం పుట్టుకకు కారణం అమెరికా తర్వాతే ఎవరైనా అన్న అభిప్రాయం దాదాపు అన్ని ప్రపంచదేశాలతో సహా భారత్, చైనాలకూ తెలిసిందే అయినా, ఇప్పుదు అవి అగ్రదేశమైన అమెరికా కు వ్యతిరేకంగా పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి వివిధ దేశాల్లో టెర్రరిస్టు సంస్ధలను పాలు పోసి పెంచిన ఘనత అమెరికాదే. అలా పుట్టిన సంస్ధలు ఇప్పుడు అమెరికాకే ఎదురు తిరిగి దానికి సమస్యగా మారాయి. తాను తయారు చేసిన టెర్రరిస్టు సంస్ధలను మట్టుపెట్టే భాధ్యతను అమెరికా ప్రపంచం పైకి నెట్టివేసింది. ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజానికి వ్యతిరేకంగా చట్టాలు చేసి, సంస్ధలు ఏర్పాటు చేసి టెర్రరిజం పై యుద్ధం ప్రకటించాలసిన అగత్యాన్ని అమెరికా తెచ్చింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పోరులో ఇండియా, బలహీన స్ధితిలో ఉండి అణచివేయబడుతున్న పాలస్తీనా కు మద్దతు ఇవ్వాల్సింది కాని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, అణు ఒప్పందం తదితరాల పేరుతో ఇండియా పాలస్తీనా, ఇరాన్ లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనె పరిస్ధితికి నెట్టబడింది. ఇక ఇప్పుడు ఇండియా కూడా ముస్లిం టెర్రరిస్టు సంస్ధలకు శతృవైపోయింది. కాశ్మీరు సమస్య వలన గతంలో పాకిస్తాన్, కాశ్మీరు ముస్లిం లకు మాత్రమే శతృవుగా ఉండేది. ఇప్పుడు ప్రపంచ ముస్లింలకు ఇండియా శతృవు. తత్ఫలితమే తాజ్ హోటల్ పై దాడి, ముంబై పేలుళ్ళు లాంటి సంఘటనలతో సహా. ప్రపంచ ఇస్లాం ఉగ్రవాద దేశాలకు భారత్ కూడా ఒక శతృవుగా మారాల్సి వచ్చింది.

నిజానికి భారత దేశం లోని యువత కూడా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థల ప్రలోభాలకూ, ప్రచారానికీ ఆకర్షితులై టెర్రరిస్టులుగా మారెందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం లో ఇక్కడకూడా చైనా పద్దతి లో యాంటీ టెర్రరిజం పై అవగాహన కోసం కొత్త కోర్సులని విశ్వవిధ్యాలయాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది.

(Visited 179 times, 1 visits today)