Home / Entertainment / చిరంజీవి ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్

చిరంజీవి ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్

Author:
జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 45 నిమిషాల పాటు ఉండి అందరిని పలకరించాడు, దీంతో చాలా కాలం తర్వాత పవన్ సోదరుడి ఇంటికి వెళ్లడం ద్వారా రకరకాల ఊహాగానాలు,ప్రచారాలకు పవన్ కళ్యాణ్ తెరదించారు. రాజకీయంగా విబేధాలు వచ్చినా కుటుంబం ఒకటిగా ఉంటుందని అనుకుంటూ వచ్చారు. కాని చాలా కాలంగా చిరంజీవి కుటుంబ కార్యక్రమాలకు ,సినిమా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం చర్చనీయాంశం అయింది. రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉన్న కుటుంబం విషయం లో అందరం కలిసే ఉన్నాం అని పవన్ చాటి  చెప్పాడు, చాల కాలం తరువాత పవన్ రావడం తో మెగాస్టార్ ఇంట్లో సందడి నెలకొంది.
శుక్రవారం నాడు కూడా శిల్పకళా వేదిక లో జరిగిన జన్మదిన వేడుకలో పవన్ కళ్యాణ్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నినాదాలు చేయడం, నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అది పెద్ద వార్త అయింది. అంతేకాదు ఇవాళ పార్క్ హయత్ హోటల్ లో జరిగే చిరు జన్మదిన వేడుకలకూ హాజరు కానున్నారు. చిరు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లడం తో ఇద్దరి అభిమానులలో ఆనందం వెల్లివిరిసింది. మెగా ఫ్యామిలీ ఒక్కటైతే ఆ హంగామాయే వేరు..
(Visited 58 times, 1 visits today)