Home / Entertainment / ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన మెగాస్టార్ 150వ సినిమా.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన మెగాస్టార్ 150వ సినిమా.

Author:

వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కనిపించి 8సంవత్సరాలు అవుతుంది. చాల కాలం తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం చేస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 3 పాటలు మార్కెట్లోకి విడుదలయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి.

chiru khaidi number 150 release date

చాలా కాలం తర్వాత చిరంజీవి మళ్ళీ హీరోగా చేస్తున్న సినిమా మరియు తన 150 వ చిత్రం కావటంతో, ఈ చిత్రంపై అటు అభిమానులకి ఇటు మెగా ఫామిలీకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరు సరసన నటింస్తుంది. భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాలతో విదుదలకి సిద్ధమైన ఈ చిత్రం, ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది . 147 నిమిషాల నిడివి గల ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జనవరి 4వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవబోతుంది.

(Visited 956 times, 1 visits today)