Home / Entertainment / మాటిస్తే ప‌వ‌న్ పాటిస్తాడు

మాటిస్తే ప‌వ‌న్ పాటిస్తాడు

Author:

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఓ సారి మాట ఇచ్చాడంటే.. ఎన్ని ఏళ్ళయిన ఆ మాట కు కట్టుబడి ఉంటాడు..తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అని పవన్ గురించి తెలిసిన వాళ్ళందరూ చెపుతుంటారు. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయడానికి టాలీవుడ్లో చాలా మంది స్టార్ డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ దర్శకుల క్రేజ్ ని బట్టి కాక, కథ నచ్చితేనే సినిమాలు తీసే పవన్ కళ్యాణ్ చిన్న దర్శకులకే చాన్సులు ఇస్తున్నాడు. అలాగే తన సినిమాల విషయం లోను కొత్తమందికి అలాగే మాట ఇచ్చి , తన మాట నిలబెట్టుకున్నాడు…తాజాగా ఓ కొరియోగ్రాఫర్‌ 6 ఏళ్ల క్రితం ‘జల్సా’ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్‌ కు ఓ సబ్జెక్ట్‌ను వినిపించాడట! నేరేట్ చేసిన విధానానికి బాగా ఇంప్రెస్ అయిన పవన్ కనీసం నాలుగేళ్ల పాటు వెయిట్ చేయమన్నారట! ఈ సమయంలో.. ఫిలిం మేకింగ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ ఎలా పని చేస్తోందో అవగాహన పెంచుకో అన్నాడట! ఇప్పుడు ఇచ్చిన మాట తీర్చడానికి రెడీ అవుతున్నదని వినికిడి..

దీంతో ఆ కొరియోగ్రాఫర్‌ ఫిలిం దర్శకత్వం ఫై మీద అవగాహన పెంచుకోవడంతో పాటు టాలీవుడ్‌లో పాపులర్ కొరియోగ్రాఫర్‌గా కూడా ఎదిగాడు. ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఆ మాస్టర్ ను అప్పట్లో తనకు చెప్పిన సబ్జెక్ట్‌ లైన్‌ను ఫుల్ స్టోరీ చేసి మళ్లీ నేరేట్ చేయమని అడిగారట. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన ఆ మాస్టర్ ప్రస్తుతం తన అభిమాన హీరో కోసం చేసిన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట . ఆ కొరియోగ్రాఫర్‌ ఎవరో కాదు నితిన్ చాలా సినిమాలకు మరియు రచ్చ , ఎవడు , ఈగ , జులాయి , రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలలో సూపర్ హిట్ సాంగ్స్ కు డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్.

(Visited 205 times, 1 visits today)