Home / Reviews / చుట్టాలబ్బాయి రివ్యూ & రేటింగ్.

చుట్టాలబ్బాయి రివ్యూ & రేటింగ్.

Author:

Chuttalabbayi-Movie-Review

సినిమా పరిశ్రమలోకి వస్తూనే ప్రేమకావాలి, లవ్లీ వంటి సినిమాలతో హిట్స్ ఇచ్చిన హీరో ఆది. ఆ రెండు సినిమాల తర్వాత సుకుమారుడు,గరం సినిమాలు చాలా నిరాశపరిచాయి. ఇప్పుడు పూలరంగడు వంటి హిట్ ఇచ్చి భాయ్ లాంటి ఫ్లాఫ్ దర్శకుడైన వీరభద్రం దర్శకత్వంలో వస్తున్నా చిత్రం చుట్టాలబ్బాయి. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒక్కసారి చూద్దాం.

కథ :

ఎవరి దగ్గర నుండైనా సరే అమౌంట్ రికవరీ చేయగల సత్తా ఉన్న రికవరీ ఏజెంట్ బాబ్జి (ఆది). ఒక బ్యాంకులో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ పాత బకాయిలను వసూల్ చేస్తూ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక రోజు కావ్య (నమిత ప్రమోద్‌) అనుకోకుండా పరిచయం అవుతుంది. వీరిద్దరూ మాట్లాడుతుండగా కావ్య అన్నయ్య ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు (అభిమన్యుసింగ్‌) వీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకోని వారిపై నిఘా పెడుతాడు. ఈలోగా ఇంట్లో కావ్యకు సంబంధం చూడటం దానితో తనకు ఇష్టంలేదని ఇంట్లో నుండి పారిపోతుంది. దానితో కావ్య అన్నయ్య తన చెల్లెలు కచ్చితంగా బాబ్జి దగ్గరికే వెళ్ళింది అని పోలీసులను పంపించి వారిని వెతకమనటం…. పోలీసుల బారి నుండి బాబ్జి , కావ్యా  పారిపోయే క్రమంలో దొరబాబు (సాయి కుమార్ ) గ్యాంగ్ వీరిని కిడ్నప్ చేస్తారు. ఇంతకు దొరబాబుకు, ఈ ఇద్దరికీ సంబంధం ఏమిటి? బాబ్జి , కావ్యా ఎందుకు పారిపోతారు? చివరికి పోలీసులకు దొరికారా! అన్నది మిగతా సినిమా.

అలజడి విశ్లేషణ:

ఈ సినిమాలో ఆది ఇదివరకు సినిమాల కంటే చాలా బాగా చేశాడు. నటనలో కానీ అలాగే డ్యాన్స్ లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ చాలా బాగా చేశాడు. దర్శకుడు ఏమైతే చెప్పాడో  అది తూచా తప్పకుండా ఆది పాటించాడు. హీరోయిన్ మాత్రం ఒకటి రెండు సీన్స్ లలో తప్ప ఎక్కడ తను అంతగా నటించలేదు.  దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే కావడం అలాగే కథనంలో కూడా పెద్దగా చెప్పుకోవలసిన అంశాలు లేకపోవడం ఈ సినిమాకు చాలా పెద్ద పొరపాటు.. సినిమా మొద‌లైన 20 నిమిషాల‌కే ఈ సినిమాలో ఏం లేదు.. అన్న విష‌యం అర్థ‌మైపోతుంది . ఇక మొదటి భాగంలో కొన్ని  కామెడి సీన్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. దర్శకుడు మంచి సీరియస్ సీన్స్ నీ కూడా చాలా సులువుగా నడిపించాడు. దర్శకుడికి ఇంటర్వెల్ కూడా ఎక్కడ వేయాలో తెలియని అయోమయంలో ‘ఇదేదో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అనుకొంటా.. జంప్ అయిపోతే మంచిది’ అనే డైలాగ్ ఫృద్వీ చేత ప‌లికించారు.

ఇక సెకాండ్ ఆఫ్ లో సాయి కుమార్, ఆది ల మధ్య మంచి సన్నీవేశాలు ఉన్న అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సెకాండ్ ఆఫ్ లో చిలక అనే మరో హీరోయిన్ వస్తుంది. ఈ హీరోయిన్ నీ మాత్రం కేవలం వ్యాప్ గా చూపించడం కోసం నటింపజేశారేమో అనిపిస్తుంది.  హీరో ముద్దు పెట్టుకున్నా, కౌగిలించుకున్నా కూడా హీరోయిన్ కి ప్రేమ పుట్టదు. కానీ వర్షంలో తడుస్తున్న తనకు హీరో గొడుగులా చిన్న తాటాకు అడ్డు పెట్టడంతో ఆమెలో ప్రేమ పుట్టేస్తుంది ఇలాంటి ఈ సినిమాలో చాలానే ఉన్నాయి.

నటీనటుల పనితీరు:

ఆది చాలా బాగా నటించాడు. ఇందులో హీరోయిన్ గా నటించిన నమితా ప్రమోద్ ఎక్కడా కూడా ఆ స్థాయి నటనను కనబరచలేదు. ఆమెలో ఆసక్తికరమైన అంశం ఒక్కటి కూడా లేదు. సాయి కుమార్ పాత్ర చాలా పవర్ ఫుల్ కానీ అందులో దర్శకుడికి ఏమి కావాలో రాబట్టుకోలేక పోయాడు. ఈ సినిమాలో కొద్దిలో కొద్దిగా  కామెడి   చేసింది పృద్వి, అలాగే పోసాని, శకలక శంకర్, ఇక విలన్ గా నటించిన రాజా కూడా ఎదో ఉండాలి కాబట్టి ఉన్నాడు అనిపించాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమా విషయాన్నికి వస్తే దర్శకుడు పూర్తిగా తన కథ, కథనం పై కొద్దిగా కూడా తన చేతిలో లేకుండా సినిమా తీశాడా! అనే అనుమానం వస్తుంది. సంగీతం అందించిన థమన్ కూడా ఎదో ఉంది అంటే ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాకు పెద్ద హెల్ప్ ఐయింది అంటే కాస్తో కూస్తో అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, అలాగే ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఇంకాస్తా కత్తెర పడవలసి ఉంటే బాగుండు. మొదటి సినిమా అయినా నిర్మాతలు ఎక్కడ రాజీపడకుండా ఖర్చుపెట్టారు.

ప్లస్ పాయింట్స్:

  • ఆది
  • ఫస్ట్ ఆఫ్
  •  కామెడి

మైనస్ పాయింట్స్:

  • కథ
  • కథనం
  • దర్శకత్వం
  • హీరోయిన్

అలజడి రేటింగ్: 2/5

(Visited 229 times, 1 visits today)