Home / Inspiring Stories / భారత దేశంలో ఎత్తైన జాతీయ పతాకం ఇప్పుడు మన హైదరాబాద్ లో

భారత దేశంలో ఎత్తైన జాతీయ పతాకం ఇప్పుడు మన హైదరాబాద్ లో

Author:

national-flag-hyderabad-telangana-formation-tallest

భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం పేరు మరో సారి మారుమోగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎత్తైన జాతీయ పతాకం రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ లో ఏర్పాటు చేయానున్నారు. హైదరబాద్ లోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఘాట్ దగ్గర ఈ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 301 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఉండాలనీ, అందుకనుగుణంగా పోల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రస్తుతం భారత దేశంలో అతి ఎత్తైన జాతీయ పతాకం జార్ఖండ్ రాజధాని రాంచిలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, అంతకంటే పెద్ద జెండా తెలంగాణలో ఎగుర వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ వేడుక తెలంగాణ రాష్ట్రా ఆవిర్బవ దినం అయిన జూన్ 2వ తేదిన ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జాతీయ జెండాలో ఉండే మూడు రంగులు ఎరుపు హిందూమతానికి, ఆకుపచ్చ ఇస్లాం మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు అని అన్ని మతాలు సోదరభావంతో మెలగాలని అలాగే అందరిలో జాతీయ భావనను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని సీఎం అన్నారు.

(Visited 673 times, 1 visits today)