Home / General / 10 వ తరగతి పాస్ అయిన ప్రతి అమ్మాయికి 10 వేలు నజరానా!

10 వ తరగతి పాస్ అయిన ప్రతి అమ్మాయికి 10 వేలు నజరానా!

Author:

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సంచలన నిర్ణయాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నాడు. పదో తరగతి పాసయిన ప్రతి అమ్మాయికి పది వేల ప్రోత్సాహక నగదుని అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని సోమవారం నాడు ఉప ముఖ్యమంత్రి శర్మ వెల్లడించారు. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల చేసినప్పటికీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు ఇంకా వెలువడలేదు.

CM Yogi Adityanath announces Rs 10000 reward for every girl who passed class 10th in Uttar Pradesh

మన దేశం లో ఆడపిల్లల పుట్టుకే గగనంగా మారింది. ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే చంపేస్తున్న దుర్మార్గపు సంస్కృతి పెరిగిపోతోంది. రానూ… రానూ… ఆడ మగ నిష్పత్తి కూడా దారుణంగా పడిపోతోంది. ఆడ పిల్లలను కన్నప్పటికీ వారిని ఇంటి పనికే పరిమితం చేస్తున్న తల్లిదండ్రులు లక్షల్లో ఉన్నారు. వాళ్లకి తిండే దండగ ఇంకా చదువెందుకు అని ఎదురు ప్రశ్నించే తల్లిదండ్రులకు కొదవ లేదు. అందుకే ఆడపిల్ల ఒకవేళ స్కూల్ కి వెళ్ళినా ఏ ఎదో తరగతి వరకు చదివించి ఆ తర్వాత చదువు మాన్పించే పరిస్థితులే మన దేశం లో ఎక్కువ. అందులోనూ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆడపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఆడ పిల్లల చదువుకి ప్రోత్సాహక నగదు అందించడం అంటే యోగిని అంతా అభినందించాల్సిందే. మొత్తం లక్ష మందికి ఈ పథకం అందుబాటులోకి రానుంది. ఈ పథకం ఎంతమందికి లాభం… ఈ మేరకు మార్పు తెస్తుంది అని ఇప్పుడే చెప్పలేం కానీ, ఖచ్చితంగా 8,9 తరగతుల్లో మానేసే పిల్లల సంఖ్యని మాత్రం తగ్గించి పదో తరగతి దాకా చదివే అవకాశాలను పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయినా ఒక ఆడపిల్ల చదువు కుటుంబానికే వెలుగు అన్న విషయమూ మనం మర్చిపోకూడదు.

ఇంతే కాదు ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం మైనారిటీల్లో చాలా మందికి కూతురి పెళ్లి చేయటానికి కూడా దిక్కులేని వారే ఎక్కువ ఉన్నారు. వీరికోసం కూడా సిఎం యోగి మరోమంచి పతాకాన్ని ఆరంబించాడు. సామూహిక వివాహాలు చేయడం ద్వారా తల్లి దండ్రులకి ఈ మైనారిటీ ఆడ కూతుళ్ళ పెళ్లిళ్లు కాస్తో కూస్తో ఘనంగా నిర్వహించే అవకాశం దొరికి౦ది. నిజంగా ఇలాంటి మంచి పథకాలతో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి యోగి ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.

(Visited 897 times, 1 visits today)