Home / Political / మరుగుదొడ్డి ఉపయోగించే కుటుంబాలకి ప్రతినెలా రూ.2500.

మరుగుదొడ్డి ఉపయోగించే కుటుంబాలకి ప్రతినెలా రూ.2500.

Author:

బహిరంగ మల విసర్జనను రూపు మాపేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు చాలా పథకాలు అమలు చేసింది. మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి సబ్సిడీ ఇవ్వటం కూడా చేసింది. అయినా, చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు మరుగుదొడ్లు 100% ఉపయోగించటం లేదు. బహిరంగ విసర్జనను రూపు మాపేందుకు, ప్రజలు మరుగుదొడ్డిని వాడేలా ప్రోత్సహించేందుకు ఓ జిల్లా కలెక్టర్ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

collector giving 2500 monthly for using toilets

ప్రతిరోజు క్రమం తప్పకుండా మరుగుదొడ్లు వాడే కుటుంబానికి ప్రతి నెల రూ.2500 అందజేస్తామని రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కలెక్టర్ అయిన సుధీర్ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం 2 గ్రామ పంచాయితీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పిన తెలియజేసారు. ఈ పథకం కెయిర్న్ ఇండియా, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంలో భాగంగా 8 కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ పథకం ద్వారా చాలా కుటుంబాలకు లబ్ది చేకూరుతుందనీ… తమ లక్ష్యం నెరవేరితే ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరిస్తామని కలెక్టర్ తెలిపారు.

(Visited 836 times, 1 visits today)