Home / Entertainment / హాస్య నటుడు పొట్టి రాంబాబు మృతి.

హాస్య నటుడు పొట్టి రాంబాబు మృతి.

Author:

Potti Rambabu Died

తెలుగు సినీ పరిశ్రమ మరో హాస్య నటుడిని కోల్పోయింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హాస్య నటుడిగా పరిచయమై, ఆ తర్వాత తనదైన స్టైల్లో అందరినీ మెప్పిస్తూ 40కి పైగా సినిమాల్లో నటించిన పొట్టి రాంబాబు ఈ ఉదయం హైద్రాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్దికాలంగా మెదడు రక్తం కట్టడంతో బాధపడుతూ వస్తోన్న ఆయన 35 ఏళ్ళ వయసులోనే ఇలా అందరినీ వీడి వెళ్ళిపోవడం విషాదం.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో పొట్టి రాంబాబు బాధపడుతున్నారు. దాదాపు 50 సినిమాల్లో పొట్టి రాంబాబు నటించారు. కత్తి లాంటి సినిమా, గీతోపదేశం, వంకరోడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. దొంగ దొంగది, గోపాల గోపాల వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ బిగ్ కమెడియన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘చంటిగాడు’, ‘కథానాయకుడు’ ఈశ్వర్‌, పులిరాజా ఐపీఎస్‌, ప్రేమతో నువ్వు వస్తావని..కృషి, వసంత రాగం చిత్రాల్లో ఈయన నటించారు. లాంటి సినిమాలతో మెప్పించిన రాంబాబు ప్రధాన పాత్రలో ‘పులిరాజా ఐపీఎస్’ సినిమా అనే సినిమా చేస్తున్న సమయంలో మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించింది. చిన్న వయసులోనే మనల్ని వదిలిపోయిన పొట్టి రాంబాబు ఆత్మకు శాంతి కలగలాని కోరుకుంటూ సంతాపం ప్రకటిస్తున్నాం.

(Visited 63 times, 1 visits today)