Home / Inspiring Stories / బతుకు జట్కా బండి కాస్తా బతుకు బజారు పాలు అవుతుందా…!

బతుకు జట్కా బండి కాస్తా బతుకు బజారు పాలు అవుతుందా…!

Author:

ఒక‌ప్ప‌టి క‌థానాయిక‌, ద‌ర్శకురాలు జీవిత “బ‌తుకు జ‌ట్కా బండి” పేరుతో జీ టెలివిజ‌న్‌లో ఓ టెలీ షో చేస్తుంది. ఇందులో విడిపోయిన భార్య, భర్తలను కలుపడానికి అని ఈ షో చేస్తున్నారు. కానీ, ఈ కార్యక్రమం చూస్తే అలా అనిపించదు కారణం, అందులో చూపించే విధానం. భార్య, భర్తలు గొడువలతో దూరంగా ఉంటున్నవారిని తీసుకొచ్చి వారికి కౌన్సిల్ రూపంలో మంచి చెడ్డ చెప్పి వారిద్దరిని కలుపడం ఈ షో ముఖ్య ఉద్దేశం. ఇందులో చాలా మంది పేదవారినే తీసుకురావడం, వారినే గుచ్చి,గుచ్చి విసిగించే పశ్నలు వేయడం చేస్తున్నారు. మరి అదే విధంగా జీవిత గారు కొన్ని ఎపిసోడ్స్ లలో మగవారిని కెమెరాల ముందే తిట్టడం కొద్దిగా చూడటానికి, వినటానికి గాని బాగాలేదు. ఉధా… జులై 15-2015 ఎపిసోడ్ ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది.

ఈ కార్యక్రమం పై మరొక ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే, ఎప్పుడు పేదవారినే ఎందుకు ఈ షో లో చూపిస్తారు, డబ్బు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు చాలా మందిని పెళ్లి చేసుకొని కొద్ది రోజులలలోనే విడిపోతున్నారు మరి వారిని ఎందుకు తీసుకురావడం లేదు? అలాగే, సినిమా  పరిశ్రమ లో చాలా మంది ఉన్నారు ఇలా విడిపోయిన వారు మరి వారీ తీసుకొచ్చి కుర్చొబెట్టి వారిని కలుపొచ్చుకద..! అలా ఉండదు ఎందుకంటే వారు ఇలాంటి వాటి షో కి వస్తే వారి పరువుపోతుందని. మరి పేదవారిది పరువు కాదా! ఒక్క సారి ఆలోచించాలి షో నిర్వాహితులు.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 8,389 times, 1 visits today)