Home / Inspiring Stories / వీరికి రక్షణ వారికి శిక్షణ

వీరికి రక్షణ వారికి శిక్షణ

Author:

Condom is must for porn

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ లో లభ్యమవుతున్న పోర్న్ మూవీస్ లో అధిక శాతం కాలిఫోర్నియాలోనే నిర్మితమవుతున్నాయి. పోర్న్ మూవీస్ బిలియన్ డాలర్ల బిజినెస్ గా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై నిర్మితమయ్యే పోర్న్ మూవీస్ లో నటించే మగవారు తప్పనిసరిగా కండోమ్స్ ధరించాల్సిందేనని తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మైకేల్ వీన్ స్టైన్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకరమైన హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి చెందకుండా కండోమ్స్ నిరోధిస్తాయి. అంతేకాకుండా నేటి యువత ఎక్కువగా పోర్న్ సినిమాల ద్వారానే సెక్స్ అంటే ఏమిటో తెలుసుకుంటున్నారు. అందుకే అందులో నటించేవారు విధిగా కండోమ్ ధరిస్తే కండోమ్ సెక్స్ ను ప్రమోట్ చేసినట్లు కూడా అవుతుంది. కాబట్టి పోర్న్ సినిమాల్లో సెక్స్ చేసేటప్పుడు మగవారు తప్పనిసరిగా కండోమ్ ధరించాలని అన్నారు. ఇకపై పోర్న్ మూవీలో నటించే వారికి అవసరమయ్యే కండోమ్స్, మెడికల్ టెస్టులు, వాక్సినేషన్ తదితర ఖర్చులు సదరు మూవీ నిర్మాతే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ విషయమై దాదాపు 2300 మంది కోర్టులో ఫిటిషన్లు కూడా వేయడం గమనార్హం. ఇప్పుడు అక్కడ ఇదే చర్చల్లో ప్రధానాంశంగా ఉండటం కూడా నిజంగా విశేషమే.

(Visited 105 times, 1 visits today)