‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు చేసిన హల్ చల్ అంతా ఇంతాకాదు.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ శాలినిలు లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న పోస్టర్లను
వీహెచ్ చింపివేస్తున్న ఫొటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. సేమ్ ఇప్పుడు అదే అర్జున్ రెడ్డిని వీహెచ్ పునరావృతం చేశారు.తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనావళిని ఈసీ ప్రవేశపెట్టిన దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ఏ రాజకీయ వ్యక్తిని – రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి వీలులేదు. కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులపైన కేసీఆర్ పథకాలు ఆయన ఫొటోలు ఉండడంపై వీహెచ్ ఆగ్రహించారు.
ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ ప్రచార ఫొటోలను వీహెచ్ చింపుతూ మీడియా కంట పడ్డాడు. దీంతో అర్జున్ రెడ్డిని మరోసారి పునరావృతం చేశాడు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలగించక పోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాచారంలోని ఆర్‌టీసీ బస్సుపై ఉన్న సీఎం కేసీఆర్ యాడ్‌ను చించివేశారు.