Home / health / షుగర్ వ్యాధికి చెక్ పెట్టండిలా…!

షుగర్ వ్యాధికి చెక్ పెట్టండిలా…!

Author:

మన దేశంలో ఒక వ్యాధితో ఎంత మాది బాధపడుతున్నారో తెలుసా! 6 కోట్ల 50 లక్షల మంది. ఇది దాదాపు ఒక రాష్ట్ర జనాభా అని ఎంత మందికి తెలుసు! మరి ఇంతకు ఆ వ్యాధి పేరు ఏంటో తెలుసా !? మధుమేహం అదేనండి షుగర్. ఒకప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ముసలి వారికి వచ్చేది కానీ ఇప్పుడు మనం తినే ఆహారం, అలాగే వాతావరణ ప్రభావంతో ఇది నడివయసు వారికి ఎక్కువగా వస్తుంది. దీని ప్రభావంతో చాలా మంది వారి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా కడుపునిండా సరిగా అన్నం కూడా తినలేరు అలాగే అందరికి నచ్చే తీపికి వీరు చాలా దూరంలో ఉండాలి. లేదనంటే మొదటికే మోసం వస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చింది అంటే ఏమి చేయలేని అసహనం ప్రతి మనిషి లో ఏర్పడుతుంది. కానీ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంటే వారు మామూలు జీవితం గడపవచ్చు అనేది నిపుణుల సూచన.

Sugar-Control

మరి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉండాలి అంటే కచ్చితమైన ఆహారపు అలవాటు చేసుకోవాలి. అలాగే నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. ఇవ్వన్నీ చేయాలి అంటే సప్పటి కుడు తినడం తప్ప మరేం చెయ్యలేము. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం ఒకటే మార్గం. మరి ఇంత భయంకరమైన వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా! మన శరీరంలో సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో.. లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో.. డయాబెటిస్ సోకుతుంది. దానితో గ్లూకోజ్ రక్తం నుంచి మానవ శరీరంలోని కణాలకు అందక రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది. దీనినే మనం షుగర్ వ్యాధి అంటాం.

మరి షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యలేమా అంటే చేయొచ్చు అంటున్నారు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్స్ . మనం తినే ఆహారం పాటిస్తూనే వారానికి కచ్చితంగా నాలుగు గుడ్లు తింటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది అంటున్నారు. మరి గుడ్డు వలన ఎలా షుగర్ నియంత్రణలో ఉంటుంది అంటే !. గుడ్డు తినడం వలన గ్లూకోజ్ రక్తంలో సమతుల్యంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈ ప్రయోగాన్ని వారు ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగించి రుజువు చేశారు. కాబట్టి వారానికి నాలుగు గుడ్లని తినేలా ఆహారాన్ని తీసుకోవడం వల్ల  షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

(Visited 5,030 times, 1 visits today)