Home / health / మందులు వాడకుండా బీపీ ని తగ్గించుకునే ఉపాయం మీ చేతుల్లోనే.

మందులు వాడకుండా బీపీ ని తగ్గించుకునే ఉపాయం మీ చేతుల్లోనే.

Author:

బీపీ (రక్తపోటు) అనేది జబ్బు కాదు కాని అది ఉండాల్సిన స్థాయి కన్న ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా పలు శరీర సమస్యలకు దారి తీస్తుంది. హై బీపీ ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అదే విధంగా లోబీపీ ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం లాంటి సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడం అందరి బాధ్యత. మరి ఇలా హై లేదా లోబీపీ తో బాధ పడే వారు ఎటువంటి మందులు వాడకుండా క్రింద చెప్పిన చిట్కాలను పాటిస్తే వారి రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

control bp without medicines

అధిక బరువు తగ్గటం: మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహరం తోనే ముడి పడి ఉంది. మనం ఎంత మంచి ఆహరం తీసుకుంటే అంత మంచి ఆరోగ్యం మన సొంతం. ఆహార అలవాట్లు హెల్తీ గా మార్చుకుంటూ తరచుగా ఒకసారి వెయిట్ చెక్ చేస్కుంటూ ఉండాలి. ఒకవేళ బరువు పెరిగితే మాత్రం కంట్రోల్ చేస్కోవాలి. . అధిక బరువుతో హై బీపీయే కాదు గుండె కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి బరువు ని అదుపులో ఉంచుకోవటం కంపల్సరీ.

మెడిటేషన్: టెన్షన్ పెట్టె విషయం వేధిస్తున్నా కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూచుంటే ఊరటగా ఉంటుంది. హై బీపీ ఉన్నవారు కూడా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రోజు కనీసం 10 నిముషాలు మెడిటేషన్ చేస్తే బీపీ వల్ల కలిగే హైపెర్టెన్షన్స్ అన్ని పోతాయి.

ఎక్సర్సైజు చేయడం: రెగ్యులర్ గా ఎదో ఒక ఎక్సర్సైజు చేయడం వలన బాడీ ఫిట్ గా ఉండటమే కాకుండా బరువు తగ్గటం లో ను దోహదపడుతుంది. వాకింగ్ లేదా జాగింగ్ కి వెళ్లలేని వారు ఆన్లైన్ లో లభ్యం అయ్యే ఎన్నో సైట్ ల లో యోగ వీడియోస్ చూస్తూ ఇంట్లోనే ప్రాక్టీస్ కూడా చేయచ్చు. ఇలా చేస్తూ ఉంటె బాడీ లో ఉండే కొవ్వు కరిగి హై బీపీ వల్ల వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి.

ఆహార అలవాట్లలో మార్పు: బయటికి వెళ్లిన ప్రతి సారి ఎదో ఒక జంక్ ఫుడ్ తినడం అనే అలవాటును మానుకోవాలి. ముఖ్యంగా గా కూల్డ్ డ్రింక్స్, చిప్స్, పిజ్జా, బర్గర్ ల లాంటి వాటికి దూరంగా ఉండటం చాల మంచిది. పండ్లు, కూరగాయలు, జ్యూస్లు, ఫైబర్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తినడం మంచిది. ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండే ఆహరం(చేపలు) తరచుగా తీసుకోవాలి.

ఆల్కహాల్ మరియు స్మోకింగ్ మానుకోవడం: హై బీపీ ఉండి మందులు వాడే వారు మద్యం సేవించడం, సిగరెట్ తాగటం వలన ఆ మందులు పూర్తిగా పనిచేయవు. సిగరెట్ మానేయడం వలన అది మీకే కాదు మీ బీపీ కి మరియు మీ ఎదుటి వారికీ కూడా మంచిది. సో ఎందుకు ఆలస్యం మీ ఆరోగ్యాన్ని పాడు చేసే వాటి జోలికి మీరు వెళ్ళకండి.

(Visited 2,031 times, 1 visits today)