నా పేరు నగేష్, ఇవ్వాళ మియపూర్ లో సికింద్రాబాద్ కు వెళ్ళేదానికి మెట్రో ఎక్కాను, మెట్రో లో నా ఎదురుంగ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తను చూడటానికి అచ్చం అమలా పాల్ లాగ ఉంది. తనను అలానే చూస్తూ ఉన్న, తన వైపే చూస్తూ ఉన్నా.
తను నన్ను చూసింది, నేను తనను చూడటం తను గమనించింది. అయినా కూడా నా చూపు తిప్పుకోలేకపోయా, అలాగే తనని చూస్తూ కూర్చున్నా. కొద్దిసేపటి తరువాత నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది.
సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వస్తే దిగుదాం అని డోర్ దెగ్గర రెడి గా ఉన్నా. స్టేషన్ వచ్చిన వెంటనే డోర్ లు తెరుచుకున్నాయి, ఇంత సేపు చేసావు గా, నాకు కనీసం బాయ్ కూడా చెప్పవా అంటూ ఒక అమ్మాయి గొంతు వినిపించింది, వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంత సేపు చూసిన అమ్మాయి నే నాతో మాట్లాడింది, బాయ్ కూడా చెప్పకుండా వెళ్తున్నావ్ ఇంత సేపు చూశావ్ గా నన్ను, కనీసం బాయ్ అయినా చెప్పు అనింది. కోచు లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు, నేను వెంటనే సిగ్గు తో బయటికి వెళ్లిపోయా, డోర్స్ క్లోజ్ అయ్యాయి.
ఆ అమ్మాయి నేనంటే ఇష్ట పడి ఆ మాటలు చెప్పిందా, లేక నన్ను అవహేళన చెయ్యడానికి చెప్పిందా అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్ కి ఇదే విషయం చెబితే, అందరిలోనూ అవహేళన చేయడానికే తను అలా మాట్లాడింది అని అన్నారు. మా ఫ్రెండ్స్ కరెక్ట్ చెప్పారు అంటారా.?