Home / Reviews / కొరియర్ బాయ్ కళ్యాణ్ రివ్యూ.

కొరియర్ బాయ్ కళ్యాణ్ రివ్యూ.

కొరియర్ బాయ్ కళ్యాణ్ courier boy kalyan movie review

Alajadi Rating

2.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నితిన్, యామి గౌతమ్, నాజర్,

Directed by: ప్రేమ్ సాయి

Produced by: గౌతమ్ మీనన్

Banner: గురు ఫిలింస్‌, మల్టీ డైమెన్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.

Music Composed by: కార్తీక్, అనూప్ రూబెన్స్

చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కొరియర్ బాయ్ మొత్తానికి, మాంచి పండుగ రోజున..అదేనండీ వినాయక చవితి నాడు తన పార్సిల్ పట్టుకుని మరీ థియేటర్స్ కు వచ్చేశాడు. మరి ఆ గణనాయకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి !

కథ:

పని లేని కళ్యాణ్ ( పీకే)—నితిన్, హైదరాబాద్ లో బలాదూర్ తిరిగే యూత్ బ్యాచ్ లో మెంబర్ అన్న మాట! తన ఫ్రెండ్ కు సాయం చేయటం కోసమని కొరియర్ బాయ్ అవతారమెత్తుతాడు .ఖాదీ భవన్ లో సేల్స్ గర్ల్ గా పని చేసే కావ్య (యామి గౌతమ్) తో అతనికి తమాషా గా ఒక కొరియర్ డెలివరీ టైమ్ లో పరిచయం…లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏర్పడుతాయన్న మాట!

ఇక, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయటం కోసం కొరియర్ బాయ్ గా రోజూ కావ్య ఆఫీసు విసిట్ చేస్తుంటాడు. విధి రాత కారణంగా, ఈ సరదా బాబు జీవితాన్ని ఒక పార్సిల్ మలుపు తిప్పుతుంది. డాక్టర్ అశుతోష్ రాణా పదేళ్ళ రీసెర్చ్ ని దెబ్బ తీసే సత్యమూర్తి (నాజర్) పార్సిల్ , మన హీరో ని నానా తిప్పలూ పెడుతుంది. అశుతోష్ రాణా మనుషులు ….ఇక, పీకె ని వెంబడించడం మొదలెడతారు….ఆ పార్సిల్ కోసం…! పీ కె కూడా పనిలో పనిగా …ఆ పార్సిల్ లో ఏముందో తెలుసుకోవటం….చేజ్ లు , ఫైట్స్ ..ఇక అక్కడ నుంచి రొటీన్ స్టోరీ అన్న మాట! ఇంతకీ పీ కె నిజం కనుక్కున్నాడా? చివరికి ఏమైంది. అశుతోష్ రాణా సక్సెస్ అయ్యాడా? పీ కె గెలిచాడా…ఆ డెడ్లీ సిట్యుయేషన్ ని  పీ కె ఎలా ఫేస్ చేశాడనేదే మిగిలిన స్టోరీ…..

 విశ్లేషణ:

కథ లో ఒక కొత్త కాన్స్పెట్ అయితే ఉంది. స్టోరీ మొత్తం నితిన్ చుట్టూతానే నడిచింది. రొమాంటిక్ సన్నివేశాలు పండించటం లో నితిన్ సక్సెస్ అయినట్టే..అతనికీ, యామి కీ కెమిస్ట్రీ బాగా కుదిరినట్టే అని చెప్పవచ్చు. యామి చూడ్డానికి ఓకే కానీ, పర్ ఫామ్ చేయటానికే పెద్దగా ఏమీ లేదు. ఒక తప్పుడు డాక్టర్ గా ఆశుతోష్ రాణా బానే చేశాడు. సినిమా తొలి భాగం లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలున్నాయి.

ఇంటర్వెల్ ముందు భాగంలో ..తర్వాత ఏమవుతుందో అని ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది కానీ…సినిమా మొత్తానికీ దెబ్బ పాటలు అనే చెప్పాలి. పాటలు బానే ఉన్నా..అవి ఎక్కువ అంతరాయం కలిగించే విధంగానే ఉన్నాయి. కార్తీక్, అనూప్ రూబెన్స్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు చందాన మిగిలింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా డీసెంట్ గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే సినిమా సెకండ్ హాఫ్ లో స్లో అయింది. కెమెరా వర్క్ కి మంచి మార్కులే పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మాదిరిగా మలచిన నాజర్ పాత్ర కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించేదే! మంచి ఇంటెరెస్టింగ్ సబ్జెక్ట్ ఎంచుకున్న డైరెక్టర్ ప్రేమ సాయి , కావల్సినంత కిక్ ని అయితే అందించలేకపోయారు. హాలీవుడ్ సినిమా “ ప్రీమియర్ రష్” కి అనధికార ఎత్తిపోతల లా అనిపించటం ఖాయం ఈ సినిమా! ఒక చక్కని కథాంశంలో అక్కర్లేని మసాలాలు కూరిస్తే, దాని ఎండ్ రిజల్ట్ —కొరియర్ బాయ్ కళ్యాణ్. మొత్తానికి ఈ సినిమా గమనానికి అడ్డం పడింది పాటలే! హడావిడి క్లైమాక్స్ అన్నీ అనర్ధాలకు మూలం అనేది నీతి సూత్రం.

 ప్లస్ పాయింట్స్:

నితిన్

సినిమాటోగ్రఫీ

నాజర్

 మైనస్ పాయింట్స్:

మిగిలినవన్నీ.

(Visited 87 times, 1 visits today)