Home / General / ఆవు కడుపున మనిషిని పోలిన దూడ

ఆవు కడుపున మనిషిని పోలిన దూడ

Author:

కాలజ్ఞాని బ్రహ్మం గారు చెప్పినట్టు కలియుగాంతం కాబోతోందా..? ఏమో ఆయన చెప్పినట్టుగా భావించే అనేక విషయాలు అప్పుడప్పుడూ జరుగుతుండడం గమనిస్తూనే ఉన్నాం. పంది కడుపున ఏనుగు పిల్లలాంటిది పుట్టడం చూసాం. అలాగే ఇటీవలే ఇంకో వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆవు కడుపున మనిషి ముఖాన్ని పోలిన పోలికలతో లేగ దూడ పుట్టింది. ఈ లేగ దూడ ముఖం అచ్చం మనిషి ముఖంలా ఉండడంతో జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఝాఫార్ నగర్ లోని ఒక గో శాలలో మనిషిని పోలిన కళ్ళు, ముక్కు నోరుతో ఈ లేగ దూడ జన్మించింది. దేవుడే ఈ అవతారం లో జన్మించాడని స్థానికులు దానికి పూజలు చేసారు. అయితే ఈ దూడ పుట్టిన గంటలోనే మరణించింది. కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు ఈ గోవు ని చూడడానికి ఎగబడ్డారు. అప్పటికే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయింది.

Cow born with a human

ఈ దూడ జననం మాములుది కాదని, ఇది నర గోవావతారం అని భావించాలని స్థానిక వ్యాపారులు పూజలు పునస్కారాలు మొదలెట్టారు. దండలేసి దండమేట్టేసుకున్నారు. మూడు రోజుల దాకా ఈ దూడని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నామని, మూడు రోజుల తర్వాత దూడకు దహన సంస్కారాలు చేస్తామని ఆ గోశాల ప్రతినిధి తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఈ దైవాంశ దూడకు గుడి కూడా కట్టనున్నామని చెప్పారు. ఈ దూడకు జన్మనిచ్చిన తల్లి ఆవుని కొన్నాళ్ళ కిందట ఒక వధశాల నుంచి రక్షించి తెచ్చినట్టు తెలిసింది. దైవానికి జన్మనిచ్చిన గోవు గా ఆ ఆవుని ప్రత్యేకంగా చూస్తున్నారు.

స్థానికులు, భక్తులు ఈ దూడకు దండలేసి పూజలు చేయడాన్ని కొట్టిపడేశారు పశు వైద్యుడు డాక్టర్ అజయ్ దేశముఖ్. ఆవు గర్భం లో జరిగిన జన్యుపరమైన లోపం వల్ల ఇలాంటి విచిత్ర లేదా వింత ఆకారాల దూడ జన్మించిందని ఆయన చెప్పారు. ఇలా గతం లో కూడా జన్యు లోపంతో అనేక జంతువులూ, మనుషులు కూడా జన్మించారు. ఇది కేవలం జన్యు సమస్యే తప్ప దైవాంశమేమీ కాదని అన్నారు. డాక్టర్ మాటలెలా ఉన్నా.. ఈ లేగ దూడకు మాత్రం దైవ సమాన గౌరవం లభించింది.

(Visited 870 times, 1 visits today)