Home / Entertainment / మహేష్,మురుగదాస్ సినిమాకి క్రేజీ టైటిల్.

మహేష్,మురుగదాస్ సినిమాకి క్రేజీ టైటిల్.

Author:

Mahesh-Babu-AR-Murugadoss Movie Title

సూపర్ స్టార్ మహేష్ బాబు తన గత రెండు చిత్రలు 1 నేనుఒక్కడినే,ఆగడు నిరాశపరిచాయి తర్వాత శ్రీమంతుడు సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ నుంచి రానున్న తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా న్యూ షెడ్యూల్ జనవరి మొదటి వారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు ఎఆర్ మురుగదాస్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలు కానుంది. ఇప్పటికే మురుగదాస్ కథ – స్క్రీన్ ప్లే వర్క్ ని ఫినిష్ చేసేసాడు. త్వరలోనే ముంబై వెళ్లి అక్కడ లొకేషన్స్ ని ఫైనలైజ్ చేయనున్నారు. ఇండియన్ న్యాయ వ్యవస్థని బేస్ చేసుకొని చేయనున్న ఈ సినిమాకి ‘చట్టంతో పోరాటం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదే ‘ఎనిమి’ టైటిల్. ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉంది. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఠాగూర్ మధు – ఎన్.వి ప్రసాద్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.

(Visited 244 times, 1 visits today)