Home / Entertainment / భళ్ళాళ దేవ ఇప్పుడు నేవి ఆఫీసర్

భళ్ళాళ దేవ ఇప్పుడు నేవి ఆఫీసర్

Author:

rana in ghazi

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు రానా దగ్గుబాటి ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీవీపీ సినిమా ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించనున్న ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో మునిగిపోయిన ‘పీఎన్ఎస్ ఘాజి’ నౌకకు సంబంధించిన మిస్టరీనే కథాంశం. అయితే ఇది చరిత్రలో చోటుచేసుకున్న ఓ మిస్టరీ. ఈ సినిమాలో రానా… నేవల్ ఆఫీసర్గా కనిపించనున్నారు. నావికా దళ యుద్ధం నేపథ్యంలో మొట్టమొదటి సినిమాగా తెరకెక్కనుందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమా నేడు సెట్స్‌పైకి వెళ్ళింది.

“అభిమానులు మాస్ సినిమా చేయమని అంటున్నారు. యుద్ధం కంటే మాస్ ఏముంది చెప్పండి?” అంటూ రానా ఈ సినిమా గురించి ఎగ్జైటింగ్‌గా మాట్లాడారు. ప్రయోగాలు చేయడం ఎప్పుడూ కొత్తగా ఉంటుందని, ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే మంచి ప్రయోగమని రానా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రావు రమేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత మరో వార్ ఫిల్మ్ చేయడం సంతోషంగా ఉందని రానా అన్నారు.

(Visited 146 times, 1 visits today)