Home / Inspiring Stories / మామిడి పండ్లు అమ్ముతు జీవిస్తున్న MP కూతురు.

మామిడి పండ్లు అమ్ముతు జీవిస్తున్న MP కూతురు.

Author:

ఈ రోజులల్లో ఒక వార్డ్ నెంబర్ కొడుకు లేదా కూతురు ఉంటే వారు చాలా హూందాగా ఉంటు వారు బైక్ లపై లేదా కార్ లలో తిరుగుతుంటారు. అదే ఓక యం.యల్.ఎ పిల్లలు అయితే వారి గురించి చెప్పవలసిన అవసరం లేదు వారికి చదువు రాకున్న ఫారిన్ పంపించి అక్కడ ఉన్నత చదువులు చదివిస్తు ఉంటారు. అక్కడి నుండి వస్తూనే వారు రాజకీయంలోకి దిగుతారు ఇది ఇప్పటి రాజకీయ నాయకుల పిల్లల పరిస్థితి.

MP Daughter Selling Mangos 1

కాని ఒక యం.పి కూతురు అంటే ఎలా ఉండాలో మనకు ప్రత్యేక్ష సాక్షి మాజీ లోకసభ డిప్యూటీ స్పీకర్ కరియా మందా కూతురు చంద్రవతి సరూ గారు. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి చాలా సింపుల్ గా జీవితాన్ని జీవిస్తుంది. తను ఎప్పుడు సమాజం కోసం పరితపిస్తుంది. అందుకే సమాజం బాగుండలంటే వ్యవస్థ మూలం అయిన విధ్యార్థి దశలోనే వారికి బలమైన పునాది అవసరం, సమాజం గురించి విశ్లేషించి వివరంగా చెప్పవలసిన భాధ్యత గురువులది అందుకే చంద్రవతి సరూ గారు టీచర్ గా పనిచేస్తూ విధ్యార్థులకు సమాజంపై అవగహన కలిపిస్తుంది. తను ఒక యం.పి కూతురు అయిన తను వ్యవసాయం చేస్తు మామిడిపండ్లను పండిస్తూ సంతలో అమ్ముతుంది. ఇలా చేయడం తనకు ఏమాత్రం చిన్నతనంగా లేదు పైగా గర్విస్తున్న ఎందుకటే ఈ రోజులల్లో వ్యవసాయం చేయడం అంటే ఇప్పుడున్న యువతకు చాలా చిన్న చూపు వారు కార్పోరేట్ లైఫ్ కి అలవాటు పడి ఉరుకుల పరుగుల జీవితంలో జీవించడం మరిచిపోయారు. అలాగే వారు తింటున్న ఆహారం ఎక్కడి నుండి వస్తుందో తెలియని స్థితిలో ఉన్నారు. అందుకే అందరికి తెలియజేయాడనికి నేనె ఇలా చేస్తున్నాను అంటుంది చంద్రవతి గారు. తను జార్ఖండ్ రాజదాని రాంఛీ కి 40 కిలోమీటర్ల దూరం లో ఉండే ఖున్తి అనే ఊరులో టీచర్ గా పనిచేస్తూ మామిడి పండ్లు అమ్ముతుంది. మామిడి పండ్లు అమ్మిన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. రాజకీయ నాయకుల పిల్లలు ఇలా కూడా ఉంటారా! అని అందరిని ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్న చంద్రవతి గారికి హ్యాట్సాఫ్.

(Visited 5,796 times, 1 visits today)