Home / Inspiring Stories / కీచకుడికి ఊరి శిక్ష ఖరారు చేసిన ముంబై హైకోర్ట్.

కీచకుడికి ఊరి శిక్ష ఖరారు చేసిన ముంబై హైకోర్ట్.

Author:

Death for Chandrabhan Sanap in Esther Anuhya murder case

మరో ఘటన లో ముంబై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంతోమంది ఈ తీర్పుని స్వాగతిస్తున్నారు కూడా. మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ అత్యాచారం, హత్యకు గురైన బందర్ టెక్కీ అనూహ్య కేసులో దోషిగా తేలిన చంద్రభాన్ సదమ్ సనప్‌కు ముంబై న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. న్యాయస్థానం ఈ రోజు తుది తీర్పును వెల్లడించింది.

2014 జనవరి 4న మచిలీ పట్నం కి చెందిన అనూహ్య ముంబాయికి వెళ్లి తర్వాత ఆచూకీ తెలియకుండా పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె TCS లో సాఫ్ట్ వేర్  ఇంజినీర్ గా పని చెవస్తోంది. పండగకని ఇంటికి వచ్చి ముంబై కి బయలు దేరిన తర్వాత రెండు మూడురోజులు గడచినాకూతురునుంచి సమాచారం లేకపోవడంతో అనూహ్య తల్లిదండ్రులు ఇటు ఏపీలోను, ముంబాయిలోను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబాయి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అనూహ్యను ట్యాక్సీడ్రైవర్‌ చంద్రభాన్‌ తీసుకువెళ్లినట్లు గుర్తించారు. జనవరి 16వ తేదీనాటికి భానూప్‌ వద్ద ఆమె మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. సీసీ టీవీ ఫుటేజీల ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు రెండునెలల తర్వాత నిందితుడిన అరెస్టు చేశారు.. విచారణలో దాదాపు 2500మందికి పైగా వ్యక్తుల్ని విచారించిన న్యాయస్థానం.. చంద్రభాన్‌ను దోషిగా నిర్ద్థారించి ఈ ఉదయమే నిందితుడికి ఉరి శిక్ష ని ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది..

విచారణ లో చంద్రభాన్ వెల్లడించిన వివరాల ప్రకారం…. ప్రాణాలతో విడిచిపెట్టాలని, అందుకు రూ.రెండు లక్షలు ఇస్తానని అనూహ్య  ప్రాధేయ పడినప్పటికీ చంద్రభాన్‌ మనసు కరగలేదు. ఈ విషయాన్ని అతనే పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత అనూహ్య ఎదురు తిరగడంతో తొలుత చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె తన వద్ద అప్పటికి ఉన్న నగదు మొత్తం ఇచ్చేస్తానని, విడిచి పెట్టాలని కోరింది. ఆ తర్వాత రూ.ఒకటి, రెండు లక్షలు సర్దుబాటు చేస్తానంది. అయినా కనికరం చూపని చంద్రభాన్‌.. అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. అనూహ్యను ఎక్కించుకుని తీసుకెళ్లిన మోటారు సైకిల్‌ చంద్రభాన్‌ స్నేహితుడు చంద్రశేఖర్‌ సాహుది.

అత్యాచారం, హత్య గురించి అతనికి చంద్రభాన్‌ చెప్పేశాడు. అనూహ్య దుస్తులు, కళ్లద్దాలు, హ్యాండ్‌ బ్యాగ్‌ను చంద్రభాన్‌ తన చెల్లెలి వద్ద ఉంచి అక్కడ్నుంచి నాసిక్‌కు పారిపోయాడు. విచారణలో క్యాబ్ డ్రైవర్ గా పని చేసే చంద్రభాన్ నే నిందితుడిగా నిర్థారించిన పోలీసులు అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టారు.విచారణలో అతనికి ఇతర నేరాలతోనూ సంబంధంఉన్నట్లు తేలింది.సంవత్సర కాలంగా అతన్ని విచారించిన కోర్టు అతనికి ఉరిశిక్ష విధించాలన్న పీపీ వాదనతో ఏకీభవించింది. గతంలోనూ ఇతర నేరచరిత్రను కూడా దృష్టిలో ఉంచుకుని సెక్షన్లు 302, 376, 201 కింద నేరస్తుడిగా పరిగణిస్తూ నిందితునికి మరణ శిక్ష ఖరారు చేసింది.

ఈ శిక్ష పై పలు మహిళా సంఘాలు,అనూహ్య తల్లితండ్రులతో పాటు పౌరులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ముంబై కోర్టు నిర్ణయాన్ని అభినందించారు…

(Visited 52 times, 1 visits today)