Home / Inspiring Stories / ఏడు రోజుల్లోనే 253 గ్రామాలకు కరెంట్ వచ్చింది

ఏడు రోజుల్లోనే 253 గ్రామాలకు కరెంట్ వచ్చింది

Author:

deen dayal upadhyaya gram jyoti yojana

ఒకటీ రెండు కాదు ఏకంగా 253 గ్రామలు కొత్తగా విద్యుత్ సదుపాయాన్ని పొందాయి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గరినుంచీ చీకటిలోనే మగ్గిన ఊళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ కాంతులతో వెలిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 253 గ్రామాలకు కరెంట్ రావటానికి ఎన్ని రోజులు పట్టిందో ఊహించ గలరా..? వారం రోజులు ఔను కేవలం వారం రోజులు జనవరి 11 నుండీ 17 వరకూ. ఈ ఏడురోజుల్లోనే ఇన్ని ఊళ్ళకూ కరెంటొచ్చింది. 69వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ని నిలబెట్టుకున్నారు. 2015 జూలై 25 న ప్రకటించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతీ యోజన పథకం కింద ఈ 253 గ్రామాలనూ ఎంపిక చేసి విద్యుత్ సదుపాయం కల్పించారు….

ఈ గ్రామాల్లో 111 ఒడిశా కు చెందినవి కాగా, 81 పల్లెలు అస్సాం లోనూ, 40 ఝార్ఖంద్, 13 రాజస్థాన్, 4 బిహార్, 3 మధ్య ప్రదేశ్, 1 గ్రామం ఉత్తర ఫ్రదేశ్ లోనూ ఉన్నాయి. ఇటువంటి పథకాలు ఇప్పుడే కాదు ఇదివరలోనూ ఉన్నయి కానీ నిథుల కొరతా, గ్రామాల్లొని అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఎన్నొ గ్రామాలు సంవత్సరాల తరబడి చీకట్లో మగ్గుతూవచ్చాయి. అయితే ఇప్పుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతీ యోజన పథకం లో భాగం గా 7600 కోట్లను కేటాయించటమే కాకుండా, పకడ్బందీ గా ప్రణాలికను అమలు చేయటం తో కేవలం ఏడురోజుల్లోనే ఇది సాధ్య పడింది.
ఈ పథకం ముఖ్యంగా నాలుగు అంశాల మీదనే దృష్టి పెట్టింది.
1. గ్రామాల లో ముందుగా విద్యుత్ అందించటం.
2. వ్యవసాయ అవసరాలకు కావలసిన విద్యుత్ ని ముందు గా అందించిన తర్వాతనే మిగిలిన అవసరాల మీద దృష్టి పెట్టారు.
3. ఎక్కువగా సరఫరా ని, వాటిలోని లోపాలనీ అధిగమించి ఎక్కువ విద్యుత్ సరఫరా చేయగలిగే లా వాటి సామర్థ్యాన్ని పెంచటం..
4. ఎక్కడ లోపాలున్నాయో గమనించి వాటిని అధిగమించే దిశగా చర్యలు తీసుకోవటం…

ఇలా ఒక్కొక్క అంశాన్నీ పూర్థిస్థాయి అవగాహనతో వేగంగా పని చేసారు.

2018 కల్లా దెశం లో ఉన్న ప్రతీ పల్లెకూ కరెంట్ అందించటమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతీ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ప్రతీ పల్లెనూ, చిన్న చిన్న తండాలను కూడా ఇప్పటివరకూ కరెంట్ లేకుండా ఉన్న ప్రతీ ప్రదేశాన్నీ విధ్యుత్ వెలుగులతో నింపనున్నారు. అంటే మరో రెండేళ్ళలో దేశం మొత్తం మీదా విధ్యుత్ లేని గ్రామమే ఉండదన్న మాట..

మారు మూల పల్లెల్లో విద్యుత్ లేకపోవటం వల్ల అభివృద్ది ఆగిపోయింది. అయితే ఇకముందు ఆ పరిస్థితి ఉండదు. ప్రతీ గ్రామం లోకి కరెంట్ వచ్చిందంటే ఇక గ్రామం లో జరిగే ప్రతీ అభివృద్ది పనీ వేగం పుంజుకుంటుంది. ఇక ముందు ఉండే అడ్డంకులన్నీ తగ్గుముఖం పట్టటం తో పాటు అభివృదీ వేగవంతమౌతుంది….

(Visited 361 times, 1 visits today)