Home / Inspiring Stories / వృధా కాబోయి ఆదా అయిన 250 కోట్లతో ఉచిత మందులు.

వృధా కాబోయి ఆదా అయిన 250 కోట్లతో ఉచిత మందులు.

Author:

నిబద్దతతో కూడిన పాలన శకం భారత దేశంలో మొదలైనట్టే ఉంది. వందల,వేల కోట్ల కుంబకోణాల వార్తలే విన్న దేశ ప్రజలు మొదటిసారిగా అంచనా వ్యయంలో మిగులు బడ్జెట్ ని చూస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్ లో సగానికి సగం ప్రజాధనం ఆదా అవుతోంది. అదీ వందల కోట్లలో. ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలంటే దాని కోసం ముందస్తుగా అంచనా వ్యయం వేస్తారు. దాని మేరకు పనులు మొదలు పెడతారు. అయితే ఇన్ని సంవత్సరాల భారత దేశ చరిత్రలో కనీసం ఒక కల్వర్టుని కూడా అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చులో నిర్మింపబడటం జరగ లేదు. ఎందుకు అన్న ప్రశ్నకి ప్రతీ భారతీయుడికీ సమాధానం తెలుసు..? ఐతే ఇప్పుడా పరిస్తితి మారే అవకాశాలున్నాయా… భారత్ లో ఉండే అవినీతి కొంతైనా తగ్గే అవకాశం ఉందా అనే వైపు మళ్ళీ కొన్ని ఆశలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యనే డిల్లిలో ఒక 6 లైన్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది ఐతే అంచనా వ్యయం కంటే వంద కోట్ల కంటే తక్కువ ఖర్చుతోనే…

ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఉన్న ఆజాద్ పూర్ నుంచి 1.6 కిలోమీటర్ల ఆరు లైన్ల ఫ్లై ఓవర్ అనుకున్న అంచనా కంటే రూ.100 కోట్ల తక్కువ ఖర్చుతో ఫ్లై ఓవర్ ను పూర్తి చేసి సంచలనంగా మారారు ఢిల్లీ ముఖ్యమంత్రి. 2013 లోనే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి పునాది పడింది ఢిల్లీలోని అజాద్ పూర్ నుంచి షాలిమార్ బాగ్ వరకు నిర్మించే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.247 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లే శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. . అయితే.. అంచనా లెక్కింపు.. టెండర్లు..శంకుస్థాపన అంతా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో చేపట్టారు. కానీ అది పూర్తి కాకుండానే ప్రభుత్వాలు మారాయి. అవినీతిని నిర్మూలిస్తాను అన్న కొత్త నినాదం తో వచ్చిన ఆం ఆద్మీ నేత అరవింద్ కేజ్రివాల్ ముఖ్య మంత్రి గా వచ్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యింది అయితే అనుకున్న దానికంటే 100 కోట్లకు తక్కువ ఖర్చు తోనే….

మనం ఈ ఆశ్చర్యంలో నుంచి కోలుకోక ముందే మరో వార్త అదే ప్రభుత్వం అదే రాష్ట్రం మరో అద్బుతం ఈ సారి రోడ్డు నిర్మాణం లోనూ అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మాణం జరుపుకుంది. ఈ సారి కూడా మిగిలిన మొత్తం 100 కోట్లు. ఈ రహదారి మంగోల్పురి నుండి ముబారక్ చౌక్ సింగిల్ పీర్ టెక్నాలజీతో నిర్మించారు. దీని అంచనా వ్యయం 450 కోట్లు కాగా 350 కోట్లలోనే పూర్తి నాణ్యతతో దీన్ని నిర్మించారు.మాజీ ముఖ్య మంత్రి శీలా దీక్షిత్ కాలంలోనే మొదలయిన ఈ రెండు ప్రాజెక్టులకూ భారీ వ్యయం అవుతుందని అంచణాలు వేసి సదరు నిధులను మంజూరు చేసారు కూడా ఐతే… కేజ్రీ ఇప్పుడు అవే ప్రాజెక్టులని అసలు వ్యయం తోనే నిర్మించేలా కాంట్రాక్టు సంస్థలతో కలిసి దీన్ని సాధించారు….

ఇప్పుడు మరో ఆశ్చర్యం ఏమిటంటే…! ఈ రెండు ప్రాజెక్టుల్లోనే కాదు మరికొన్ని చిన్నా చితకా ప్రాజెక్టుల్లో ఆదా చేసిన 250 కోట్లతో ఇప్పుడు డిల్లి ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు పంపిణీ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తన ట్విట్టర్ పేజీలో ప్రకటించాడు. ఈ ఫిబ్రవరి 1 నుంచీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి యూజర్ చార్జీలు ఉండబోవనీ, ప్రభుత్వాసుపత్రిలోని డాక్టర్లు రాసిన మందులు అక్కడే ఉచితంగా పొందవచ్చనీ ఆయన తెలిపారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా పూర్తి స్థాయి ఆరోగ్య వసతుల కల్పనకు ఇక్కడ బీజం పడింది. ఇక మిగిలిన రంగాలలోనూ కేజ్రివాల్ తన మార్క్ పాలనని సాగిస్తే డిల్లి భారత దేశ ఆదర్ష రాష్ట్రం అవటానికి ఎంతో కాలం పట్టదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు 2015-16 సంవత్సరాన్ని బేస్ గా తీసుకుని లెక్కవేస్తే 36 వేల కోట్లరూపాయలు అవుతుందన్న అంచనాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. 2013 సంవత్సరం లెక్క ప్రకారం ఇది 16 వేల కోట్లరూపాయలే. పెరిగిన ధరల దృష్ట్యా బడ్జెట్ పెరుగుతోందంటూ చెబుతూనే ఉన్నారు.పూర్తి స్థాయి పారదర్శకతో వ్యవహరించాలే కానీ.అద్భుతాలు చేయొచ్చన్న విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతలతోచేసి చూపించారు. ఇవాళ.. రేపటి రోజున ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ఒక అంచనాతో మొదలైతే.. అది పూర్తి అయ్యేసరికి అంచనాకు మించి బారీగా ఖర్చు కావటం తెలిసిందే. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఢిల్లీ రాష్ట్ర సర్కారు చేసింది. ఇలాంటి పని తీరు దేశమంతా జరిగితే భారత్ కి అచ్చే దిన్ వచ్చేసినట్టే.

(Visited 1,512 times, 1 visits today)