Home / Inspiring Stories / ప్రవేటైనా,గవర్నమెంటైనా స్కూలంటే ఇలానే ఉండాలి.

ప్రవేటైనా,గవర్నమెంటైనా స్కూలంటే ఇలానే ఉండాలి.

Author:

Delhi cm Aravind Kejriwal

నర్సరీ లోపు విధ్యార్థుల తల్లితండ్రులకు కాస్త ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుండి ఢిల్లీ ప్రభుత్వం. ఇక పై ప్రైవేట్ స్కూళ్ళలో మేనేజ్మెంట్ కోటా ని రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం తీసుకున్నారు.స్కూళ్ళ నిర్వహణా ఫీజుల వసూలు విశయంలో ఎటువంటి చట్టాలూ లేకపోవటం వల్ల వసూళ్ళలో ఒక క్రమమూ,పారదర్శకతా లోపించాయని ఆయన అభిప్రాయ పడ్డారు. అందుకే మేనేజ్‌మెంట్ కోటా కింద ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను చేర్చుకునే విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ సీఎం వెల్లడించారు. పాఠశాలల్లో ఇప్పటివరకు 25శాతం సీట్లు మాత్రమే వెనుకబడిన వర్గాల కోసం కేటాయించారని.ఇక నుంచి అన్ని సీట్లు వారికి అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలో విద్య రంగం లో యాజమాన్య కోటా “అతిపెద్ద కుంభకోణానికి మూల కారణం గా మారిందనీ,ఈ విషయం లో ప్రభుత్వం ఒక “మ్యూట్ స్పెక్టేటర్”గా వుండదు అనీఅన్నారు..

వివిధ స్కూల అధికారిక వెబ్ సైట్లలో ఉన్న “నిరంకుషంగా,వివక్షత తో కూడిన 62 నిబందనలను రద్దు చేసారు.ఈ రద్దు నిబందన ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటున్న డిల్లీలోని 2500 పాఠశాలలకూ వర్థిస్తుంది. ఈ కొత్త నిబందనల వల్ల ప్రైవేటు పాఠశాలల దోపిడీ పద్దతి తగ్గుతుందనీ,వెనుకబడిన విధ్యార్థులకీ ఎంతో ఉపయోకరం గా ఉంటుంది. అంతే కాదు డొనేషన్ల పేరుతొ తీసుకునే డబ్బుల విధానం లోనూ పారదర్శకత ఉంటుంది.

నిజానికి విధ్య అనేది ఞానాన్ని పంచేదిగానూ,ఆ విధ్యార్థి భవిశ్యత్తులో సాధించబోయే దానికి పెట్టు బడిగానూ ఉండాలి తప్ప. విధ్య అనేదే వ్యాపారం కాకూడదు. ఎన్నో విలాస వస్తువుల లాగా ణాన్యమైన విధ్య ఏ కొందరికి మాత్రమే అందుబాటులో ఉండటం అనేది ఒక రకమైన సామాజిక హెచ్చుతగ్గులకూ,వివక్షలకూ కారణమౌతోంది…అందుకే ఈ పద్దతి ని మిగిలిన అన్ని రాష్ట్రాలూ అనుసరించటం వల్ల మేలు తప్ప నష్టం ఏమీ ఉండదు.

ఐతే ఈ ఆప్ సర్కార్ నిబందనల్లో ఒక దానికి గట్టి దెబ్బే ఎదురయ్యింది ఎవరి నుంచో తెలుసా..? ఒక రెండేళ్ళ బుడతడి నుండీదేమిటంటే….
ప్రాథమిక విద్యలో భాగమైన ప్రి-స్కూల్‌లో ప్రవేశాల కోసం నాలుగేళ్లు, ప్రైమరీ స్కూల్‌కి ఐదేళ్లు, ఒకటో తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) డిసెంబర్ 18న సర్క్యులర్ జారీచేసింది. జనవరి 1 నుంచి 22 తేదీ వరకు హస్తినలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండున్నరేళ్ల బాలుడు ఉదయ్‌ప్రతాప్‌ సింగ్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలుడి తరఫున న్యాయవాది అఖిల్ సచార్‌ వాదనలు వినిపిస్తూ డీవోఈ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని, ఈ సర్క్యులర్ వల్ల 2017 వరకు తన క్లయింట్ ప్రి-స్కూల్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మార్చి 31లోపు మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకోని పిల్లలకు కూడా ప్రి-స్కూల్‌లో అడ్మిషన్స్‌ పొందకుండా ఈ సర్క్యులర్ అడ్డుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాజీవ్ శక్‌ధర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం, డీవోఈ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీచేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

(Visited 370 times, 1 visits today)