Home / Political / కొడుకు యాక్సిడెంట్ చేసినందుకు తండ్రిని కూడా అరెస్ట్ చేసారు

కొడుకు యాక్సిడెంట్ చేసినందుకు తండ్రిని కూడా అరెస్ట్ చేసారు

Author:

ఒక పిల్ల వాడు తప్పు చేస్తే అతని తల్లి తండ్రులే భాద్యత వహించాల్సి ఉంటుందా? ఔననే అంటున్నారు డిల్లీ పోలీసులు. తాగి నిర్ళక్ష్యంగా కారు నడిపి ఒక ప్రాణాన్ని బలితీసుకున్న ఒక మైనర్ బాలున్నే కాక లైసెన్స్ లేకున్నా అతని కి కార్ ఇచ్చినందుకు అతని తండ్రి కూడా అరెస్టయ్యాడు.

ఈ నెల నాలుగవ తారీఖున ఇంటర్ పరీక్షలు ముగియటం తో ఆ సాయంత్ర మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న ఒక మైనర్ బాలుడు తన బెంజ్ కార్ ని విపోరీతమైన వేగం తో నడిపాడు. ఉత్తర డిల్లి లో ఉన్న శ్యాం నాథ మార్గ్ దగ్గర పక్కనే ఉన్న మార్కెట్ లో షాపింగ్ చేసుకొని రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్దార్థ శర్మ అనే మార్కెటింగ్ ఉద్యోగిని ఢీకొట్టారు.

ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించిన ఢిల్లీ పోలీసులు డ్రైవ్ చేసిన విద్యార్థిని అరెస్టు చేసి అతను మైనర్ కావటం తో బెయిల్‌పై విడుదల చేశారు. అయితే రెండో రోజే మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేయటంతో తేరుకున్న పోలీసులు. యూటర్న్ తీసుకోవలసి వచ్చింది. అంతే లైసెన్స్ లేకుండా కుమారుడికి డ్రైవింగ్ చేయడానికి కారు ఇచ్చిన కారణంగా అతడి తండ్రి అగర్వాల్ ని కూడా పోలీసులు ఈ ఏప్రిల్ 8 న అరెస్టు చేశారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.మైనర్ బాలుదికి లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఇవ్వటమే కాకుండా ఒక మైనర్ కి ప్రమాదం కలిగించే పరిస్థితులకు కారకుడవటమూ,ఇంకొక వ్యక్తి మరణానికి ంపరోక్షంగా కారణం అన్న అభియోగాల మీద అగర్వాల్ ని అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారులు చెప్పారు.

అయితే ఈ వ్యక్తి మరణానికి కారణమయిన విద్యార్థి కి ఇదే మొదటిసారి కాదు ఇదే కారుతో మార్చిలో కూడా ఉత్తర డిల్లి లోనే ఓ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడనీ, రాష్ డ్రైవింగ్ చేసి ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

 

 

 

(Visited 362 times, 1 visits today)