Home / Inspiring Stories / ఢిల్లీ విద్యార్థులకు కాలుష్యం సెలవులు.

ఢిల్లీ విద్యార్థులకు కాలుష్యం సెలవులు.

Author:

Delhi pollution

నానాటికీ పెరిగి పోతున్న విపరీతమైన కాలుష్యం దృష్ట్యా చైనా రాజధాని బీజింగ్ నగరంలో విజయవంతంగా అమలు చేస్తున్న సరి-బేసి వాహనాల విధానాన్ని జనవరి ఒకటోతేదీ నుంచి మన దేశ రాజధాని లోనూ అమలు చేయనున్నట్టు ఢిల్లీ రాష్ట్ర సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. సరి-బేసి విధానం అంటే వాహనం నంబరు చివరన సరి సంఖ్యలో ఉండే వాహనాలు ఒక రోజు రఒడ్డెక్కితే రెండోరొజు అంటే సరిసంఖ్య వాహనాల తర్వాతి రోజు బేసి సంఖ్య ఉండే వాహనాలను మాత్రమే రోడ్ల మీదకు అనుమతిస్తారన్న మాట. దీనివల్ల కాలుష్యమూ, ట్రాఫిక్ సమస్యలు రెండూ పరిష్కారమౌతాయని భావిస్తున్నారు.

delhi2

ఈ నిర్ణయం కాని అమలు జరిగితే జనవరి 1 నుంచి దాదాపుగా రోజువారీగా రోడ్ల మీదకు వచ్చే వాహనాల్లో 50 శాతం తగ్గిపోతాయట. అప్పుడు సౌకర్యం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే దీనికి బదులుగా 6వేల ప్రైవేటు వాహనాల్ని అదనంగా రోడ్ల మీదకు తీసుకురావాలని భావిస్తున్నారు. అంటే ఒక కారులో ఒకే వ్యక్తి బయటకు వెల్లటానికి బదులుగా నలుగురితో కలిసి బస్సులో వెళ్తాడు లేదా ఏదైనా ప్రైవేటు రవాణా వాహణాన్ని వాడుకుంటాడన్నమాట. ఐతే అంతమంది మనుషులని చేరవేయాలంటే తగినన్ని బస్సులుండాలి కదా మరి. అందుకే 6వేల ప్రైవేటు వాహనాల్ని అదనంగా రోడ్ల మీదకు తీసుకురావాలని భావిస్తున్నారు. వీటిలో 2వేల స్కూల్ బస్సులున్నాయి. స్కూలు బస్సుల్ని ప్రజారవాణా కోసం వినియోగించాలంటే స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు. అందుకే స్కూలు విద్యార్తులకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని భావిస్తోంది. ఈ నిర్ణయం కానీ అమలైతే ఢిల్లీలోని 28 లక్షల మంది విద్యార్థులకు రెండు వారాలు పొలుష్యన్ సెలవులు వచ్చినట్లే. ఈ పదిహేను రోజుల్లోనూ మరో ప్రత్యామ్న్యాయాన్ని ఆలోచించే టైం దొరుకుతుంది లేదంటే మరిన్ని బస్సులని తెప్పించేదాకా ఈ స్కూల్ బస్సులనే వాడతారన్న మాట. మొత్తానికి దసరా సెలవులూ,సంక్రాంతి సెలవుల్లాగా కాలుష్య సెలవులు ప్రకటిస్తే పిల్లలకు హ్యాపీనే కదా…

(Visited 161 times, 1 visits today)