Home / Inspiring Stories / డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ,దసరా మరియు తెలంగాణా అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవాలు.

డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ,దసరా మరియు తెలంగాణా అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవాలు.

Author:

Denmark Dasara 1

తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హేగన్లో బతుకమ్మ, దసరా ఉత్సవాలు కన్నుల వేడుకగా జరుపుకున్నారు. తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మొదటి వార్షిక ఉత్సవాలని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు డెన్మార్క్‌లోని వందలాది తెలుగు ప్రజలతో పాటు, మన సంస్కృతిని తెలుసుకోవడానికి పలువురు డెన్మార్క్ దేశస్థులు కూడా హాజరు అయ్యారు.

Denmark dasara 2

కార్యక్రమంలో భాగంగా మహిళలు బతుకమ్మలను పేర్చి, తెలంగాణాలో బతుకమ్మ పండుగకు తీసిపోకుండా ఆడి, పాడి సందడి చేశారు.  అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.  ఉత్సవాలకి వచ్చిన వారందరూ రుచికరమైన తెలంగాణా విందు భోజనాన్నిఆరగించి ఆనందించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా డెన్మార్క్ మినిస్టర్ యెప్పె బ్రూస్ హాజరు అయ్యారు.
Denmark dasara 3

ఈ ఉత్సవాలు టాడ్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి బయ్యాపు, వైస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి సామ,రాజ్ కుమార్,రఘు భీరం,శ్యాం చెలిక, శ్రీను పందిరి,శశి కట్ట,  మహిళా కార్యవర్గ సభ్యులు ఉమ, మాధురి, కిరన్మయీ, ఇతర సభ్యులు రంజిత్, శ్యాం ఆకుల, శ్యాం శుంకిషల,రాజు, సంతోష్, జగదీష్, మరియు తధితరులు సహకారంతో నిర్వహించారు.

(Visited 69 times, 1 visits today)