Home / Inspiring Stories / డెన్మార్క్ లో మొదటి రోజు బతుకమ్మ ఉత్సవాలు.

డెన్మార్క్ లో మొదటి రోజు బతుకమ్మ ఉత్సవాలు.

Author:
తెలంగాణ సంస్కృతి ఖండాంతరాలు దాటింది, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో మొదటి రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డెన్మార్క్లోని తెలంగాణ మహిళలు ఎంగిలీపూళ బతుకమ్మ వేడుకని తెలంగాణలో జరిపిన విధంగా ఆనందోస్తవాలతో జరుపుకున్నారు. విదేశాలలో కూడా మొదటి రోజు బతుకమ్మ వేడుకలని నిర్వహించి టాడ్ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పింది.
Bathukamma Sambaralu at Denmark 1

 

Bathukamma Sambaralu at Denmark 2
అక్టోబర్ 24న టాడ్ తరుపున డెన్మార్క్‌లో దసరా – బతుకమ్మ సంబరాలు మరియు టాడ్ మొదటి వార్షిక ఉత్సవాలు జరపటానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు టాడ్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి బయ్యపు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాడ్ కార్యవర్గం సతీశ్ సామ, రఘు భేరమ్, శ్యాం, శశి, రాజ్ కుమార్, దామోదర్, శ్రీను, రాజు మరియు మహిళా కార్యవర్గం తరపున ఉమ రెడ్డి, కిరన్మయీ, మాధురి, పూర్ణిమ, మహిత, స్రవంతి,  స్వాతి తదితరులు పాల్గొన్నారు.
(Visited 117 times, 1 visits today)