Home / Entertainment / ధగ ధగ లాడే నవరాత్రి వెలుగుల్లో మీరూ తారలా మెరిసిపోవాలనుకుంటున్నారా ?

ధగ ధగ లాడే నవరాత్రి వెలుగుల్లో మీరూ తారలా మెరిసిపోవాలనుకుంటున్నారా ?

Author:

ధగ ధగ లాడే నవరాత్రి వేడుకల్లో…మీరు కూడా వెలిగిపోవాలనుకుంటున్నారా ?అయితే, ఈ వార్త మీ కోసమే. అందగత్తెల సోయగాలకు మరిన్ని మెరుగులు దిద్దెందుకు , ప్రపంచ ప్రఖ్యాత సౌందర్య నిపుణురాలు షహనాజ్ హుస్సేన్ ఈ రోజు నుంచీ రెడీ గా ఉంది. ఈ రోజు నుంచి ఈ నెల 23 వ తేదీ వరకూ నవరాత్రి దసరా ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే గదా.

ఇందుకోసం ఆమె , కొన్ని బ్యూటీ టిప్స్ షేర్ చేస్తోంది. కాంతి రెప్పల పైభాగంలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ షాడో లతోఉన్న ఐ లైనర్ ని దిద్దుకుంటే….బ్రైట్ లైట్ల కాంతుల్లో మీరు కూడా ధగ ధగ లాడిపోతారుట! ముందస్తుగా చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేసుకున్న తర్వాత, లిక్విడ్ మాయిశ్యురైజర్ అప్ప్లై చేస్తేనే ఉపయోగం ఉంటుందని చెపుతోంది షహనాజ్ హుస్సేన్. ఆయిలీ స్కిన్ ఉన్న మహిళలైతే, ముందస్తుగా ఎస్త్రింజెంట్ లోషన్ అప్ప్లై చేయాలని షహనాజ్ సజెస్ట్ చేశారు. మొత్తానికి ..దసరా కోసం మహిళలను అందంగా ముస్తాబు చేయాలనుకుంటున్న షహనాజ్ సూచనలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదో రకం మార్కెటింగ్ మరి! సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పుణ్యమా అని ప్రతి అకేషన్ నూ మార్కెట్ చేసుకుంటున్నారు …..అందిన ప్రతిదాన్నీ వాడేసుకోవటం అంటే ఇదే కామోసు!

 

 

 

 

 

(Visited 59 times, 1 visits today)