Home / Entertainment / దసరా బరి నుండి రామ్ చరణ్ అవుట్.

దసరా బరి నుండి రామ్ చరణ్ అవుట్.

Author:

రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ధృవ’. ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్, తమిళ్ లో సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అవడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇన్ని రోజులు దసరా రిలీజ్ గానే ప్రచారం జరుపుకున్న ఈ సినిమా తాజా సమచారం ప్రకారం ఆ రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

dhruva-movie-release-date

‘ధృవ’లో విలన్ గా నటిస్తున్న అరవింద్ స్వామి ఆరోగ్యం బాగాలేక కొద్దీ రోజులు షూటింగ్ ఆలస్యం అయ్యింది, దానితో అనుకున్న సమయానికి ఈ సినిమా పూర్తీ కాలేదు. షూటింగ్ హడావిడిగా పూర్తీ చేసినా ప్రమోషన్స్ కి సమయం దొరకదు అని దసరా బరి నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎలాగు దసరాకు రాని కారణముగా ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వినూత్నంగా చేయాలని భావిస్తుంది గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ. ఈ సినిమాలో చరణ్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కనిపించనుంది. అలాగే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.

(Visited 110 times, 1 visits today)