Home / Inspiring Stories / మన సైనికులందరూ ఒకేలా సెల్యూట్ చేయరని మీరెపుడైనా గమనించారా..!

మన సైనికులందరూ ఒకేలా సెల్యూట్ చేయరని మీరెపుడైనా గమనించారా..!

Author:

సెల్యూట్ సైనిక జీవితంలో ఒక భాగం… బాడీ మొత్తం స్టిఫ్ గా ఉంచి,మెరిసి పోయే యూనీ ఫాం లో,కళ్ళలో ఆత్మ విశ్వాసం కనిపిస్తూండగా ఒక సైనికుడు చేసే వందనం.. మనలో ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే మీరెప్పుడైనా గమనించారా…! మన త్రివిధ (ఆర్మీ,నేవీ,వాయు సేన) దళాల సైనికులు చేసే సెల్యూట్ లు ఒకే విధంగా ఉండవు. మూడు దళాలలో ఉండే ఉధ్యోగులు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా సెల్యూట్ చేస్తారు… ఇది మీకు కాస్త ఆశ్చర్యం కలిగించొచ్చు గానీ ఈసారి ఎప్పుడైనా టీవీలో గౌరవ వందనం సమర్పించే పెరేడ్ చూసినప్పుడు గమనించండి… మూడు దళాల సెల్యూట్ పద్దతీ వేరు వేరుగా ఉంటుంది…. ఈ పద్దతులెలా ఉంటాయంటే…

3

ఇండియన్ ఆర్మీ:

Army

శరీరం మొత్తం స్టిఫ్ గా ఉంటుంది. కుడి అరచెయ్యిని పూర్తిగా తెరిచి వేలి కొనలను కనుబొమ్మకు ఆనుకునే విధంగా వేగంగా సెల్యూట్ చేస్తారు. కళ్లలో ఉండే ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబించేలా చూపులు సూటిగా ఉంటాయి. కళ్ళు చుట్టుపక్కల చూడవు. వేరే ఆలోచహనలు లేకుండా దృడమైన మనసుతో ఉన్నాను అనే సంకేతంగా ఉంటూదీ సెల్యూట్. ఈ విధానం లో ఆయుధాలను కనబడనివ్వరు….

ఇండియన్ నేవీ:

Navy

పూర్తిగా తెరచిన కుడి చేతిని నుదుటివరకూ తీసుకు వస్తారు అయితే… ఆ కుడి చేయి ముందుకు కాకుండా పూర్తిగా నేలవైపు వంచి ఉంచుతారు. అరచేయి 90 డిగ్రీల కోణం లో నేలవైపు తిరిగి ఉంటుంది.షిప్ లో పనిలో ఉన్నవారు అధికారులకి సెల్యూట్ చేసే టప్పుడు చేతిపై ఉండే ఆయిల్,గ్రీజు మరకలు కనిపించటం అవమాన కరంగా ఉంటుందనే భావన తో నే ఈ పద్దతి ఏర్పాటు చేసారట…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్:

aIR fORCE

2006 మార్చ్ వరకూ మామూలుగా ఆర్మీ పద్దతిలోనే ఎయిర్ ఫోర్స్ వారి సెల్యూట్ కూడా ఉండేది. కానీ 2006 మార్చ్ లో వైమానిక దళం కూడా ప్రత్యేక పద్దతిలో సెల్యూట్ చేయాలని నిర్ణయించుకుంది, ఆమేరకు ఆదెశాలను కూడా జారీ చేసింది. అప్పటినుంచీ కొత్తపద్దతిలో సెల్యూట్ చేస్తున్నరు వైమానిక దళ సైనికులు కూడా. ఈ పద్దతెలా ఉంటుందీ అంటే… కుడి అరచేతిని నుదుటి పైభాగం వరకూ తీసుకొస్తారు అయితే అరచేయి పూర్తిగా ఎదుటివారికి కనిపించదు,అలా అని నేవీ పద్దతిలో పూర్తి కిందకీ చూడదు… 45 డిగ్రీల కోణం లో కాస్త వంగి ఉంటుంది. ఇలా ఉంచటానికి ప్రత్యేక కారణాలేమీ లేవు ఇదివరకు వాయుదళ సైనికులు కూడా మామూలు ఆర్మీమెన్ లాగే సెల్యూట్ చేసే వారు.. అయితే ఆర్మీ,నేవీలకు ప్రత్యేక పద్దతులుండతం తో వాయు సేనకు కూడా ఒక పద్దతి ఉండాలని ఈ పద్దతి అమల్లోకి తెచ్చారు…

(Visited 1,802 times, 1 visits today)