Home / Inspiring Stories / ఈ పవిత్ర భారతంలో నమ్మకాన్ని మారు పేరుగా నిలుస్తున్నఅక్కడి ప్రజలు…

ఈ పవిత్ర భారతంలో నమ్మకాన్ని మారు పేరుగా నిలుస్తున్నఅక్కడి ప్రజలు…

Author:

మన దేశం ఒక్కప్పుడు నీతి, నిజాయితీకి పెట్టింది పేరు. నీతికోసం, నిజాయితీ కోసం  ఆస్తులను, అధికారాలను చివరికి ప్రాణాలను సైతం వదులుకున్న గొప్ప దేశం. కానీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో నీతి, నిజాయితీ కూడా మెల్లగా కనుమరుగైపోతున్నాయి. ఒక్కప్పుడు మానవ సహజ లక్షణం నీతి, నిజాయితీ అయితే ఇప్పుడు అవి లేకపోవడమే మానవ లక్షణం అనే విధంగా తయారైంది మన దేశం.

మనకు పకృతి నిశింతగా పరిలిస్తే వాటి నీతి, నిజాయితీ మనకు అర్ధం అవుతాయి. పకృతి ఒడిలో పెరిగిన మనకు కూడా మనకు తెలియకుండానే నీతి, నిజాయితీ అనేవి మనలో ఒక భాగం అయిపోయినవి.మనకు పల్లెల్లో మనుషులను  చూస్తుంటే వారి నీతి నిజాయితీ అర్ధం అవుతుంది. పల్లెవాసుల్లో స్వచ్ఛమైన ప్రేమ, అనురాగంతో పాటు నీతి, నిజాయితీ అనేవి వారికి పెద్దల నుండి వచ్చిన ఆస్తి. అదే పట్టణాలలో వారి పని అవడం కోసం, వారు ఎదగడం కోసం నీతి, నిజాయితీ అనేవి వదిలేసి అవినీతో కూరుకుపోయారు చాలా మంది.మనం నీతిగా, నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దానికి తగిన ప్రతిఫలం అనుకున్నదానికంటే ఎక్కువగానే పొందవచ్చు అని చాలా సందర్భాలలో మనకు తెలిసే ఉంటుంది.మరి ఈ రోజులలో కూడా ఇంకా నీతి,నిజాయి ఎక్కడ ఉంది అనేక కదా మీ అనుమానం … ఒక్క ప్రాంతంలో మాత్రం ఇప్పటికి నీటికి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తుంది అదే మిజోరం ప్రాంతం.

mizoram-people

మిజోరం ప్రాంతం చుట్టూ ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, అడవులు, పచ్చటి బయళ్లతో ఎటు చూసిన అందమైన ప్రకృతితో భూతాల స్వర్గంలా ఉంటుంది.అక్కడి పకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి మనుషులు కూడా అంత స్వచ్ఛంగా నీతి,నిజాయితో ఉంటారు.మిజోరం రాజధాని ఐజ్ వాల్  నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పొడవునా స్థానిక రైతులు కట్టెలతో వేసిన పాకలు మనకు కనిపిస్తాయి. ఆ పాకలలో అక్కడి రైతులు పండించిన అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. అలాగే అడవిలో దొరికే పండ్లు, స్వచ్ఛమైన పూలు, తేనె వంటి పదార్థాలు అక్కడ ఉంచుతారు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే అక్కడ ఎవరు మనకు కనిపించారు. మనం పాక దగ్గరికి వెళ్లేసరికి అక్కడ పాకలో ఉన్న పదార్థాల పట్టిక, అలాగే వాటి ధర చిన్న అట్టపై రాసి ఉంటుంది. ఎవరికీ ఎంత కావాలో తీసుకోని పక్కనే ఉన్న చిన్న డబ్బాలో పైసలు వేయాలి. మరి చిల్లర లేకుంటే ఎలా అనుకోవచ్చు! డబ్బాలో చిల్లర కూడా ఉంటుంది.కష్టమర్లు ఎన్నిపదర్థాలు తీసుకున్నారో వాటికి ఎంత అయిందో వారే లెక్కలు వేసుకొని వాటికి సరిపడ డబ్బులు ఆ డబ్బాలో వేసిపోతారు.ఇక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం  మీద ఆధారపడి బ్రతికే వారు పదార్థాలు విక్రయం కోసం ఒక మనిషి పెట్టుకునేంత స్థోమత మాకు లేదు అంటారు.మేము మనుషులను నమ్ముతాము అందుకే ఈ విధంగా చేస్తున్నాం అంటున్నారు అక్కడి వారు. ఈ పద్దతి ఇప్పటి నుండి కాదు పూర్వం రోజులనుండి అనుసరిస్తున్నట్టు తెలిపారు.ఎంతైనా అక్కడి  ప్రజలనుండి మనం తెలుసుకోవలసింది చాలా ఉంది.

(Visited 1,243 times, 1 visits today)