Home / Entertainment / పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం తన జీవిత లక్ష్యం అంటున్న టాప్ ప్రొడ్యూసర్.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం తన జీవిత లక్ష్యం అంటున్న టాప్ ప్రొడ్యూసర్.

Author:

Dil Raju Pawan Kalyan

దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే చాలు, ఆ సినిమా పై అంచనాలు పెరిగిపోతుంటాయి జనాలకి అంత నమ్మకం ఆ బ్యానర్ పై, దిల్ రాజు బ్యానర్ నుండి సునీల్ హీరోగా కృష్ణాష్టమి అనే సినిమా రేపు విడుదల కాబోతుంది, ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం తన జీవిత లక్ష్యం అని చెప్పాడు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ మంచి స్క్రిప్ట్ తీసుకురా.. తప్పకుండా సినిమా చేద్దామని మాటిచ్చాడని.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు దిల్ రాజు తెలిపాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే మాములు విషయం కాదని, స్క్రిప్ట్ అంత నాకు నచ్చినట్లే పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ కి వినిపిస్తానని.., ఆ కథ పవన్ కు నచ్చితే సినిమా పట్టాలెక్కుతుందని, సినిమా బడ్జెట్ ఎంతైనా ఫర్వాలేదని దిల్ రాజు తెలిపాడు.రేపు విడుదల కాబోతున్న ‘కృష్ణాష్టమి’ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని చెప్పాడు,ఈ సినిమాతో హీరోయిన్ గా నిక్కి గల్రాని వెండితెరకి పరిచయం అవుతుందని, ‘కృష్ణాష్టమి’ చిత్రంతో పాటు మెగాహీరో సాయిధరమ్ తేజ్ తో ‘సుప్రీమ్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నానని..మరో అయిదు చిత్రాలు స్క్రిప్ట్ దశల్లో ఉన్నట్లు దిల్ రాజు తెలిపాడు.

(Visited 202 times, 1 visits today)