Home / Entertainment / యదార్థ సంఘటననే నేను శైలజ.

యదార్థ సంఘటననే నేను శైలజ.

Author:

nenu sailaja movie tickets

‘సెకండ్ హ్యాండ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్ తిరుమల విజయాన్ని అయితే అందుకోలేకపోయాడు. ఇప్పుడు కిషోర్ తిరుమల తెలుగులో రెండవ ప్రయత్నంగా చేసిన సినిమా నేను శైలజ. రామ్ – కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా జనవరి 1న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా కిషోర్ చేప్పిన విశేషాలు “సెకండ్ హ్యాండ్ నిరాశ పరిచిన మాట నిజమే.. ఆ టైంలోనే నా లైఫ్ లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ కథని తయారు చేసుకున్నాను. అప్పుడే నేను స్రవంతి రవికిషోర్ గారిని కలిసి ఈ కథ చెప్పాను,పూర్తి కథ విన్నాక రామ్ కూడా వెంటనే ఓకే చెప్పేసాడు. మనం కొన్ని అనవసరపు ఫీలింగ్స్ ని కూడా బాగా ఎక్స్ ప్రెస్ చేస్తారు, కానీ ప్రేమను మాత్రం ఎందుకు పర్ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతున్నారు అనే పాయింట్ ని గట్టిగా చెప్పాను. మంచి ఫీల్ ఉంటుంది. రామ్ ఇందులో ఎలాంటి విషయాన్ని అయినా పర్ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేసే పరిస్థితుల మధ్య పెరుగుతాడు. అలాగే తను నేను ఎలా చెప్తే అలా చేస్తానని పూర్తిగా నాకు సరండర్ అయ్యాడు. ఆడియన్ చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించేలా ఉండాలి. అందుకే ఫ్రెష్ పేస్ అయ్యుండాలని వెతికి కీర్తిని తీసుకున్నాం.. అలాగే థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు సినిమా చూస్తున్నట్లు కాకుండా ఒకా జీవితాన్ని, ఒక అందమైన ఫీలింగ్ ని అనుభవిస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండేలా కథ రాసుకున్నాను” అని అన్నాడు.

(Visited 83 times, 1 visits today)