Home / Entertainment / పద్మశ్రీ పై స్పందించిన రాజమౌళి.

పద్మశ్రీ పై స్పందించిన రాజమౌళి.

Author:

Rajamouli Padma Award

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొన్నటి దాకా వంద కోట్ల రూపాయల బిజినెస్ చేయగల సినిమా కోసం ఎదురు చూశారు. అలాంటిది ఏకంగా 100, 200 కోట్లు దాటి 300 కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే సంచలనమే. తెలుగు సినిమా చరిత్రతో పాటు భారతీయ సినిమా చరిత్రలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించాడు ఎస్ఎస్ రాజమౌళికి.ఎవరైనా సరే తనకు తాను ఎదగాలని కానీ.. అండదండలు చూసుకుని ముందుకెళ్లకూడదు ఈ మాట సరిగ్గ మన రాజమౌళికి సరిపోతాయి, ఎందుకంటే తన ఇంట్లో చాలా మంది సినిమా పరిశ్రమకు చేందిన వ్యక్తులు ఉన్నారు అందులో శివదత్తా వారి పెద్ద నాన్న, వారి నాన్న విజయేంద్ర ప్రసాద్, అన్న కీరవాణీ, ఇలా చాలా మంది ఉన్న తనకంటు ఒక సపరేట్ రూట్ ని ఎంచుకోని తనదైన శైలీలో దూసుక్కుపోతున్న టాలివుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమాతో భారతదేశం మొత్తం ఒక్క సారిగా తనవైపు తిప్పుకున్న టాలెంట్ డైరెక్టర్. తనకు ఇప్పుడు పద్మ శ్రీ రావడం టాలివుడ్ మొత్తం గర్విస్తుంది. నిన్న భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిన పద్మ అవార్డ్స్ లో రాజమౌళికి పద్మశ్రీ పురష్కారాన్ని అందించింది.

గత ఏడాదే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజమౌళి పేరుని పద్మ అవార్డులకి సిఫార్సు చేయాలనుకుంది,కాని రాజమౌళి పదే పదే వద్దని చెప్పడంతో సిఫార్సు చెయ్యలేదు, కాని ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం రాజమౌళిని సంప్రదించకుండా పద్మ అవార్డులకి సిఫార్సు చేసింది.

ఈ విషయంపై రాజమౌళి మరోలా స్పందించారు. ‘నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మిక్స్డ్ ఫీలింగ్ లో ఉన్నాను. నిజానికైతే ఈ పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి నేను అర్హుడిని అని నేను అనుకోవడం లేదు. ఏదో వినయం కోసం ఈ మాటలు చెప్పడంలేదు. ఇప్పటిదాకా నేను ఏం చేసాను, ఏం సాధించాను అనేది నాకు తెలుసు. ఈ అవార్డు అందుకునేలా కళారంగంలో నా బ్రిలియన్స్ ని చూపలేదు. రామోజీరావు అండ్ రజినీకాంత్ లకి పద్మ విభూషణ్ లు రావడం చాలా పర్ఫెక్ట్. ఇలాంటి లెజెండ్స్ తో కలిసి ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని’ రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

(Visited 749 times, 1 visits today)