Home / Entertainment / నా ‘ప్రేమకథ’ వినండి అంటున్న సుక్కు.

నా ‘ప్రేమకథ’ వినండి అంటున్న సుక్కు.

Author:

Sukumar @ Krishna Gadi Veera Prema Katha Audio Launch Stills

.సుకుమార్ కి అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ తెచ్చిన ఈ చిత్రం ఆర్య. తెలుగులో ఎన్ని ప్రేమకథ చిత్రాలు వచ్చిన యువత మాత్రం ఎప్పటికి మర్చిపోలేని చిత్రం. సుకుమార్ వెండితెరకి ఈ సినిమా ద్వారనే దర్శకుడిగా పరిచయమయ్యాడు.అప్పట్లో వన్ సైడ్ లవ్ అంటూ వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. సుక్కు మొదటి నుండి విభిన్న కథలతో, లాజిక్ లతో మ్యాజిక్ చేస్తూ పలు సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఇటీవల విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయం సాధించిన సుక్కు తన ప్రేమకథ గురించి చెప్పుకొచ్చాడు.

‘ఆర్య’ చిత్రం విడుదల రోజున హైదరాబాద్ లోని ఒక ధియేటర్ కి సుకుమార్ వెళ్ళినపుడు అక్కడ ఒక అమ్మాయి సుకుమార్ ని ఆటోగ్రాఫ్ అడిగిందంటా..ఆ అమ్మాయి సుక్కుకి నచ్చడంతో తన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చాడంటా..దాంతో వారిద్దరి మధ్య అలా స్నేహం మొదలై ప్రేమగా మారిందని సుక్కు చెప్పుకొచ్చాడు. ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోలేదని, కాని మా కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నానని ఆ తర్వాత తమ అత్తమామ గారు కూడా మా పెళ్ళికి ఓకే చెప్పి తమతో కలిపోయారని అలా తన ప్రేమకథ సుఖాంతం అయిందని తెలిపాడు. తన భార్య పేరు హంసిని అని ప్రస్తుతం తనకి ఒక అబ్బాయి మరియు అమ్మాయి అని ఈ క్రియేటివ్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.

(Visited 106 times, 1 visits today)