Home / Entertainment / నయా కాంబినేషన్స్

నయా కాంబినేషన్స్

Author:

bunny

దర్శకుడు విక్రమ్ కుమార్ సౌత్ సినిమాలో వున్న టాప్ స్క్రిప్ట్ రైటర్లలో టాప్ ప్లేస్ లో వుండదగ్గవాడు. ఏ కథకు ఎలాంటి స్క్రీన్ ప్లే సరిపోతుందో, తూకమేసి రాయగలవాడు. ‘మనం’ లాంటి అద్భుతమైన స్క్రిప్ట్ ను తయారుచేసినవాడు.’13 బీ’, మొదటి సినిమా తర్వాత చాలా కాలం తర్వాత ‘ఇష్క్’ సినిమాతో మెప్పించి, ఆ తర్వాత ‘మనం’ సినిమాతో తెలుగులో తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు తమళనాట 24 సినిమాతో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఓ లైన్ చెప్పాడట బన్నీకి. పిచ్చ పిచ్చగా నచ్చేసిందట.

అయినా విక్రమ్ కుమార్ మిగిలిన డైరక్టర్లలా కాదు. స్టో అండ్ స్టడీ..విన్స్ ది రేస్ టైపు. 24 సినిమా తర్వాత తాను చేయబోయే రెండు సినిమాలూ తెలుగు హీరోలతోనే ఉంటాయని తెలిపారు. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు, మరొకటి అల్లు అర్జున్‌తో ఉంటాయని ఆయన అన్నారు. ఇక గతంలోనే విక్రమ్ కుమార్ మహేష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. తాజాగా వీరిద్దరూ మళ్ళీ జతకట్టనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహేష్ ‘బ్రహ్మోత్సవం’తో పాటు ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సరైనోడు’తో బిజీగా ఉన్నా, సమ్మర్ కల్లా ఫ్రీ అయిపోనుండడంతో విక్రమ్ కుమార్ ’24’ తర్వాత అల్లు అర్జున్‌తోనే జతకట్టే అవకాశం కనిపిస్తోంది.

 

(Visited 85 times, 1 visits today)