Home / Entertainment / దువ్వాడ జగన్నాధం రివ్యూ & రేటింగ్.

దువ్వాడ జగన్నాధం రివ్యూ & రేటింగ్.

dj review

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, మురళీ శర్మ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్.. తదితరులు

Directed by: హరీష్ శంకర్

Produced by: దిల్ రాజు

Banner: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్

Music Composed by: దేవిశ్రీ ప్రసాద్

డీజే… దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌.. టైటిల్ లోనే కామెడీ, మాస్ లక్షణాలు కనబడుతున్నాయి. పైగా స్తైలీష్ హీరో అల్లు అర్జున్.. గబ్బర్ సిoగ్ ఫేం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ప్లస్ దిల్ రాజు 25 వ చిత్రంగా వస్తున్న డీజే  చిత్రం పై ప్రేక్ష‌కుల‌తో పాటు, సినీ ప‌రిశ్ర‌మ కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురు చూసింది. అల్లు అర్జున్ మొదటిసారి బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌ని పోషించ‌డం ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసింది.పైగా ఇప్పటికే టీజర్లు బాగా హిట్టై సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి. ఇన్ని స్పెషాలిటీస్ తో రిలీజయిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అంచనాలను అందుకుందా ?.. డీజే గా బన్నీచేసిన హంగామా ఎలా ఉందన్నది తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్కి వెళ్లి చూసి రావాల్సిందే.

క‌థ:

దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి (అల్లు అర్జున్‌) ఒక సూపర్ డూపర్ వంటవాడు. విజ‌య‌వాడ దగ్గర స‌త్య‌నారాయ‌ణ‌పురం అనే అగ్ర‌హారంలో ఉంటూoటాడు. శాఖాహార వంట‌కాల్లో మనోడు జిల్లాలోనే ఫేమస్ . దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ లేకుండా ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో అసలు వేడుకే జరగదంటే మనోడి చేతి వంట‌ల రుచి ఊహించొచ్చు.సడన్ గా ఓరోజు మనోడికి ఫ్యాష‌న్ డిజైన‌ర్ పూజ (పూజ‌హెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది కాస్తా ప్రేమ‌గా మారుతుంది. ఇక్కడ లవ్ స్టోరీ, రోమాన్స్ గట్రా యాజ్ యూజువల్. అసలు కథ ఏంటంటే.. అగ్ర‌హారం, వంట‌లే లోకంగా బతికే శాస్త్రి  ఎవ‌రికీ తెలియ‌కుండా, డీజేగా హైద‌రాబాద్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఒకొక్క‌రినీ టార్గెట్ చేసి చంపేస్తూ, ప‌నుల్నిచ‌క్క‌బెడుతుంటాడు. ఇంత‌కీ శాస్త్రి ఎవరు? డీజేగా ఎందుకు మారాల్సి వ‌చ్చింది?  శాస్త్రికి హ‌త్య‌లు చేసేoత సమస్య ఏంటి ? డీజే ని ఎంకరేజ్ చేస్తున్న పురుషోత్తం ఎవ‌రు? విలన్ రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేష్‌)తో శాస్త్రికి శత్రుత్వం ఏంటి ? రొయ్య‌ల నాయుడు అక్ర‌మాల‌ని బ‌య‌టపెట్టేందుకు శాస్త్రి ఏం చేశాడు? ఎలా చేశాడు.. చివరికి కథ ఎలా సుఖాoతమైంది అనేదే డీజే మెయిన్ స్టోరీ.

అలజడి విశ్లేషణ:

అగ్రహారం లో బ్రాహ్మ‌ణ యువ‌కుడైన దువ్వాడ‌ జ‌గ‌న్నాథ శాస్త్రి పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫామిలీ బ్యాక్ డ్రాప్ లో నడిచే రివెంజ్ ఫార్ములా క‌థ ఇది. శాస్త్రి పాత్ర చుట్టూ వచ్చే సీన్లు సినిమాకి కొత్త‌ద‌నాన్ని ఇచ్చాయి. మిగిలిన సినిమా అంతా రొటీన్ రెగ్యులర్ రివేంజ్‌ డ్రామానే. అయితే ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే,ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అగ్రిగోల్డ్ స్కాం లాంటి నేపథ్యం సినిమా పట్ల ఆసక్తి పెంచింది. ఈ ఫ్యామిలీ రివెంజ్ కథకి, కామెడీని, యాక్ష‌న్‌ని, గ్లామ‌ర్‌, ఎమోషన్ ని రంగరించి కొత్త‌గా వండి వార్చాడు దర్శకుడు. ఫ‌క్తు కమర్షియల్ సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, యాక్ష‌న్‌, రొమాంటిక్ స‌న్నివేశాల‌తో  గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఇంటర్వల్ కి ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగా ఆక‌ట్టుకుoటాయి. దేవిశ్రీప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ ని మరింత ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. సెకండాఫ్ మాత్రం బాగా రోటినే. సీటీమార్ పాట‌తో బ‌న్నీ డ్యాన్స‌ర్‌ గా తన స్థాయిని ఇంకో రేంజ్ కి తీసుకెళ్ళాడు. మిగతా అన్ని సీన్లు మనం ముందే ఊహించచ్చు. క‌థ‌లో ఇంకో ట్విస్ట్ ఉంటె బాగుంటుంది అని ఆడియన్స్ అనుకుంటుండగానే క్లైమాక్స్ వచ్చేస్తుంది. ఇదంతా ఏదోలా నడిచిపోయినప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం వెరైటీ ప్లస్ కొత్త‌ద‌నం చూపించాడు ద‌ర్శ‌కుడు. రెగ్యులర్ ఫైట్లతో కాకుండా కామెడీతో క్లైమాక్స్ ని ఫినిష్ చేసిన స్టైల్ ఇంటరెస్టింగ్. ఓవరాల్ గా రెగ్యులర్, రొటీన్ గా స్టోరీతో వచ్చిన డీజే అందరిని మెప్పించలేకపోవచ్చు..!

నటీనటుల పనితీరు:

అల్లు అర్జున్ ఫస్ట్ టైం బ్రాహ్మణ యువకుడి పాత్రలో క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుంది. అటు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ శాస్త్రిగా, ఇటు డీజేగా రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. డీజేగా స్టైలిష్‌గా బన్నీ కనిపించాడు. డీజే పాత్రలో స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుని పాత్రతో సరికొత్తగా కనిపిస్తాడు. భాష, యాస విష‌యాల్లో బన్నీ ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. యాక్ష‌న్‌, డ్యాన్సుల్లో మ‌రోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచారు. అలాగే పూజా హెగ్డే అందం సినిమాకి బాగా ప్లస్సయింది. ఆమె ప్ర‌తి స‌న్నివేశంలోనూ గ్లామ‌ర్‌గా క‌నిపించింది. హీరోయిన్ పాత్ర‌కి చెప్పుకోద‌గ్గ ప్రాధాన్యం లేక‌పోయినా, అందం, గ్లామర్ తోనే ఆక‌ట్టుకొంటుంది. వెన్నెల కిషోర్‌, రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, ముర‌ళీశ‌ర్మ వాళ్ల వాళ్ల పాత్ర‌ల బాగానే న‌టించారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ యాజ్ యుజువాల్ బాగున్నాయ్. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌లు, నేప‌థ్య సంగీతంతోనూ సినిమాకి ప్రాణం పోశారు. అయ‌నంక బోస్ కెమెరా సినిమాకి ఇంకో ఎస్సెట్. హ‌రీష్ శంక‌ర్ డైలాగ్ రైటర్ గా, ద‌ర్శ‌కుడిగా బాగా తీశాడనే చెప్పాలి. మొత్తానికి అందరూ కలిసి ఓ పాత కథని ఫన్ ఎంటర్ టైనింగ్ ఫార్ములాతో సినిమాని  హిట్టు కొట్టేలా తీశారు. ఓవరాల్ గా డీజే ఆదరగోట్టాడనే చెప్పాలి.

ప్లస్ పాయింట్లు:

  • డైలాగ్స్ , స్క్రీన్ ప్లే
  • అల్లు అర్జున్
  • పూజా హెగ్డే గ్లామర్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ క‌థ
  • రొటీన్ సీన్లు

పంచ్ లైన్: ఇలా రొటీన్ కథలతో సినిమాలు తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..!

 

(Visited 2,155 times, 1 visits today)