Home / health / రాత్రిపూట నిద్రకు ముందు ఇవి మాత్రం తినకండి…

రాత్రిపూట నిద్రకు ముందు ఇవి మాత్రం తినకండి…

Author:

ఏ వ్యక్తికైనా కంటినిండా నిద్ర తప్పనిసరి. సరిగా నిద్ర లేనట్లయితే చేసే పనిపైన ధ్యాస ఉండదు. రాత్రిపూట నిద్ర పోయేముందు నిద్రాభంగం కలిగించే కొన్ని రకాల ఆహారపదార్థాలను తినకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్లలో ఉండే మెగ్నీషియం, యాంటియాక్సిడెంట్స్ తోపాటు కెఫీన్ అనే పదార్థం ఉంటుంది.

దీనివల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. అందువల్ల నిద్రపోయే ముందు డార్క్ చాక్లెట్లు తినొద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బట్టర్, క్రీమ్, సాస్ లు పడుకునే ముందు తీసుకుంటే సరిగా నిద్ర పట్టదని, వాటికి రాత్రి సమయంలో వీలైనంత దూరంగా ఉండాలని అంటున్నారు.

dont eat these items before sleep

 కారంతోపాటు స్పైసీ గా ఉండే ఏ ఆహార పదార్థాలు అయినా రాత్రి పూట తిన్నట్లయితే నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. పిజ్జాలు, ఐస్ క్రీములు, ఎక్కువ చీజ్ ఉన్న ఆహారపదార్థాలు మరియు వరి అన్నం ఎక్కువగా తీసుకున్నా, మటన్ తోపాటు ఇతర మాంసాహార పదార్ధాలు రాత్రి వేళ తింటే అవి సరిగా జీర్ణం కాకపోవడం వల్ల సుఖ నిద్ర పట్టదంటున్నారు నిపుణులు. అందుకే రాత్రివేళ మితాహారం తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని పోషకాహార నిపుణులు సూచించారు.

(Visited 5,992 times, 1 visits today)