Home / Political / విక్స్ వాడకండి-ఔషద నియంత్రణా మండలి

విక్స్ వాడకండి-ఔషద నియంత్రణా మండలి

Author:

do not use vicks

         భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న యాంటిబయాటిక్,యాంటిడయాబెటిక్ మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా భారత ఔషద నియంత్రణ సంస్థ ప్రకటించింది.ఈ మందులలో కొన్ని కాంబినేషన్లు ప్రమాద కరమైనవిగా నియంత్రణ సంస్థ తేల్చింది.గత వారం 344 మందులు నిషేదించినట్లు వెల్లడించింది.అందులో “పెన్సిడీల్,కొరెక్ష్,బెనడ్రిల్” వంటి బ్రాండెడ్ దగ్గుమందులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.వెయ్యికి పైగా కేసులలో ప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉందని నిషేదిత మందులలో కొన్ని శరీరానికి పడనివి కాగా.. మరికొన్ని ప్రభావం లేక పోవడం గమనించినట్లు వెల్లడించారు. మరికొన్ని మందుల వివరాలు సమాచారం అందాల్సి ఉందని ,కొన్ని నమూనాలు పరిశీలనకు పంపినట్లు ఔషద నియంత్రణ అధికారులు వివరించారు.ప్రజలకు సురక్షితమైన మందులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.ప్రస్తుతం ఉన్న మందులపై పలుమార్లు పరిశీలించామని చెప్పారు కొన్ని మందులలో వచ్చే కాంబినేషన్లు వాటి పరిశోదనా పత్రాలు వాటి వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

do not use benadryl

       కొన్ని మందుల కాంబినేషన్ సరైనవి కాదని తేలినట్లు అధికారులు నిర్ధారించారు.వీటిలో ఎక్కువ శాతం మనం మామూలుగా వాడేవే.. నిషేదిత మందులలో పారసిటమాల్,విక్స్ యాక్షన్ 500 డైక్లోఫేనాక్,అజిత్రోమైసన్,సెట్రిజోన్, పెన్సిడీల్, కోరెక్స్,బెనడ్రిల్ వంటి వి ఉన్నాయి. అసిక్లోఫినాక్+పారాసెటమాల్+రాబిప్రోజోల్, నెమిసులైడ్+డైక్లోఫినాక్, పారాసిటమల్+సెట్రిజన్+కఫైన్, అజిత్రోమైసిన్+ఓఫ్లోక్ససిస్ కాంబినేషన్ లో ఉన్న ఔషదాలతో పాటు మొత్త0 340 ఔషదాలను నిషేదించింది. అయితే భారత ఔషద నియంత్రణ సంస్థ ఉత్తర్వుల ప్రకారం విక్స్ యాక్షన్ 500 ఎక్ష్ట్రా తయారీ, పంపిణీ నిలిపి వేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ అంశం పై పలు ఫార్మా కంపెనీలు హైకోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ఫై స్టే విదించినట్లు తెలుస్తుంది.నిషేదిత ఉత్పత్తుల కంపెనీల జాబితాలో 30సంవత్సరాల పాటు సుదీర్ఘంగా  ఔషద ఉత్పత్తులను అందించిన ఫార్మ కంపెనీలు ఉన్నాయని వాటిపైన చర్యలు తీసుకునే విషయంలో మరోసారి ఆలోచించాలన్న వాదనను కోర్టు పట్టించుకోలేదు. జలుబు వల్ల కలిగే ఐదు రకాల రుగ్మతలనుండి వెంటనే ఉపశమనం అందిస్తామంటూ పి&జి తీసుకువచ్చిన విక్స్ యాక్షన్ 500 ఇక కనిపించదు. జలుబు అనగానే మనకు గుర్తొచ్చే మెడిసిన్ విక్స్ యాక్షన్ 500 ఎక్ష్ట్రా …. ఇప్పటి నుండి అవి మెడికల్ షాప్ లలో దొరకవు, ఒకవేళ పాత స్టాక్ ఇచ్చినా మీరు మాత్రం వాటిని తీసుకోవొద్దు…

(Visited 848 times, 1 visits today)