Home / Inspiring Stories / ప్రతీ కుక్కకీ ఓ రోజొస్తుంది… బంగారు మెడల్ కూడా.

ప్రతీ కుక్కకీ ఓ రోజొస్తుంది… బంగారు మెడల్ కూడా.

Author:

Ludivine

అమెరికాలోని అలబామా ప్రాంతం. మారథాన్ రన్నింగ్ జరుగుతోంది రన్నర్లంతా పరుగు మొదలు పెట్టారు అందులో ఒక బ్లడ్ హౌండ్ జాతికి చెందిన శునకం కూడా చేరింది. తనని ఎవరూ ఆ రన్ కి ఆహ్వానించకున్నా తనంతట తానే వచ్చి ఆ మారథాన్ లో చేరి పోయింది అంతే కాదు. ఫ్రొఫెషనల్ రన్నర్లకి ధీటుగా పరుగు తీసి టాప్ 10 లో నిలబడింది కూడా.

Ludivine

అలబామాలోని ఎల్మాంట్ అనే ప్రదేశానికి చెందిన ఏప్రిల్ హాంలిన్ అనే ఒక మహిళ. అక్కడి ఎల్మాంట్ హైస్కూల్ లో గైడెన్స్ కౌన్సిలర్ గా పని చేస్తోంది.బ్లడ్ హౌండ్ జాతికి చెందిన కుక్క పిల్లని పెంచుకుంటోంది. లుద్విన్ అనే ఆ కుక్క ని వెంటపెట్టుకొని దగ్గరలోనే ఉన్న యార్డ్ లోకి వెళ్ళిన హాంలిన్ కుక్కను కాసేపు అలా వదిలి. తాను పార్కులో ఉండిపోయింది. అయితే అదే సమయంలో అక్కడ మారథాన్‌ ప్రారంభం కావడం చూసిన లుదివిన్‌ కాస్తా రన్నర్స్‌తో చేరి పరుగులు మొదలు పెట్టింది. ఏదో కొద్ది దూరం కాదు మొత్తం మారథాన్ ట్రాక్ 13.1 మైళ్ళు అంటే దాదా21 కిలోమీటర్ల దూరం పరుగు తీసి గమ్యాన్ని 1:32:56నిమిషాలలో పూర్థి చేసి టాప్ 10 లో ఏడవ స్థానంలో నిలిచింది. ఐతే 160 మంది పాల్గొన్న ఈ రన్ లో మన రన్నర్ గారు అనఫీషియల్ గా పాల్గొనటంతో అనఫీషియల్ గానే “ప్రత్యేక బహుమతి” ఇచ్చి లుదివిన్ గారిని సత్కరించారు.

Ludivine

ఐతే ఇంతా చేసి మన అథ్లెట్ చేసిన ఘనకార్యం గురించి యజమానురాలైన ఏప్రిల్ హాంలిన్ కి తెలియనే తెలియదు ఐతే మారథాన్ కమిటీలో ఉన్న ఆమె స్నేహితుడొకరు. మెడల్ తో ఉన్న లుద్విన్ ఫొటోని ఆమెకు ఫార్వర్డ్ చేసారట. అప్పటివరకూ తన చుట్టు పక్కలే ఉందనుకుంటున్న తన “బుజ్జి కుక్క పిల్ల” సాధించిన ఘనకార్యం ఆమెకు తెలిసింది. “మామూలుగూ లుద్విన్ కి బద్దకం చాలా ఎక్కువ మరి ఈరోజు ఇంత దూరం ఎలా పరిగెత్తిందో అర్థం కావటం లేదు” అంటూ న్యూస్ చానల్ కి చెబుతూ మురిసిపోతోంది హాంలేట్.

Dog 3

రేస్ లో 6వ స్థానంలో వచ్చిన టిం హార్వత్ మాట్లాడుతూ “ఇది నేను రేస్ లో పాల్గొనే ముందే నా దగ్గరికి వచ్చింది ఆ తర్వాత నాతోనే ఉంది. ఐతే పరుగు మొదలైన కాసేపటి దాకా ఇది చాలా వెనక బడింది ఆ తర్వాత రేస్ మొత్తం నాతోనే పరుగు తీసింది. దీని మెడలో ఉన్న టగ్ ని బట్టి అది ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఎవరిదో పెంపుడు కుక్క అని అర్థమైంది. ఇది నాకు రేస్ లో తోడుగా వచ్చిన నా మిత్రుడు” అంటూ లుద్విన్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.

Dog 2

ఐతే అన్నిటికంటే ఆశ్చర్యం ఇంకోటి ఉంది అనాధ బాలల సంక్షేమం కోసం జరిపిన ఈ మారథాన్ కమిటీ, 2017 కు గానూ జరపబోయే మారథాన్ పేరు “ఎల్మాంట్స్ హౌండ్ డాగ్ హాఫ్ మారథాన్” గా ప్రకటించింది.ప్రతీ కుక్కకీ ఓరోజొస్తుందని తెలుసు గానీ ఒక మెడలూ,ఒక ఈవెంట్ కూడా వస్తాయని తెలియని లుద్విన్ మాత్రం, ఇప్పుడు మళ్ళీ బద్దకంగా ఇంట్లో పడుకొని నిద్రపోతోందట….

(Visited 217 times, 1 visits today)