Home / Inspiring Stories / ఏడుగురి ప్రాణాలని కాపాడి వీరమరణం పొందిన కుక్క.

ఏడుగురి ప్రాణాలని కాపాడి వీరమరణం పొందిన కుక్క.

Author:

కుక్కలు విశ్వసానికి మారు పేరు అంటారు. కుక్కకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలే గానీ అది చేసే అద్బుతాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కుక్కలు వాసన చూసి మరి ఎక్కడ ఏముందో కనిపెట్టగలవు అంత పవర్  ఉంటుంది కుక్కలకు. ఒక కుక్క ఇలానే వాసన చూసి  ఏడుగురి ప్రాణాలను కాపాడింది. అవును మీరు వింటుంది నిజమే…. ఎక్కడ అనుకుంటున్నారా!

Ecuador Dog

గతవారం ఈక్వెడార్‌లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంపం వల్ల 654 మంది చనిపోయారు, చాలా మంది చాలా రకాలుగా సర్వం కొల్పోయారు. కొందరు కాళ్ళూ, చేతులు విరిగి అవిటివాళ్ళు అయ్యారు. ఇలాంటి సందర్బంలో శిధిలాల కింద చిక్కుకొని ఉన్న వారి ఆచూకి కోసం, వారిని రక్షించేందుకు అధికారులు చాలా శ్రమ పడ్డారు, ఎంత శ్రమ పడిన శిధిలాల కింద ఉన్న వారిని కనిపెట్టడం కష్టమైన పని ఎందుకంటే ఆ శిధిలాల కింద ఇంతకు మనుషులు ఉన్నారో లేదో తెలియదు, లేకుంటే పర్వాలేదు కాని ఒక వేలా ఉన్నారు అనుకోండి వారిని ఏవిధంగా గుర్తు పట్టాలి అన్నప్పుడు మనిషి శ్వాస, వాసన ఆధారంగా ఎక్కడ ఉన్నాడో అని గుర్తుపట్టే శక్తి కుక్కలకు ఉంటుంది.

Ecuador Dog

అందుకే డెకొ అనే కుక్కను రంగంలోకి దింపారు. శిధిలాలపై తిరుగుతూ క్షతగాత్రులను గుర్తుపట్టింది డెకొ. శిధిలాల కింద చిక్కుకున్న ఏడుగురిని డెకో గుర్తించింది. వెంటనే అధికారులు ఆ ఎడుగురి ప్రాణాలు కాపాడారు. నిరంతరాయంగా ఎత్తుపల్లాలపై తిరగడంతో డెకోకు శ్వాస కోస సంబంధిత సమస్య ఏర్పడింది. తర్వాత కొద్ది సేపట్లోనే గుండెపోటు వచ్చి మరణించింది. ఏడుగురికి ప్రాణాలను కాపాడి.. తాను చనిపోవడం అందరినీ కలచి వేసింది. ఏది ఎమైన ఒక కుక్క ఇంత మంది ప్రాణాలను కాపాడి చివరకు తన ప్రాణాలను వదిలింది.

(Visited 1,129 times, 1 visits today)