Home / Inspiring Stories / సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తున్నవీడియో

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తున్నవీడియో

Author:

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో అందరి ప్రశంసలు పొందుతుంది. అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఎలా మొదలవుతుంది అంటే, ఒక యువ కుర్రాడు రోడ్డు పైన ఒక బండి వద్ద తినడం కోసం ఒక ఆహార పదార్ధం తీసుకుంటాడు. అదే సమయంలో అతడికి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుండగా ముచ్చటగా తనవైపే చూస్తూ ఉంటాడు. ఆ తరుణంలోనే ఆకలితో ఉన్న ఒక కుక్క ఆ యువకునికి కనిపిస్తుంది, వెంటనే తాను కొనుకున్న ఆహార పదార్ధం కుక్క నోటికి అందించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మరుసటి రోజు నుండి ఆ కుర్రాడు కారు పార్కింగ్ చేసే చోట ఎవరు పార్కింగ్ చేయకుండా తరమటమే కాక, కారుని శుభ్రంగా ఉంచుతుంది. అందరి కార్లపై పక్షులు మల విసర్జన చేస్తున్న తన కారు శుభ్రంగా ఉండటంతో ఆ కుర్రాడు ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఒకరోజు ఆఫీస్ నుండి బయటికి వచ్చి కారు తీయబోతున్న సమయంలో ఆ కుక్క అతని బ్యాగ్ ని నోటా కరుచుకొని పరుగెతూ ఒక ప్రదేశంలో ఆగుతుంది. ఆ ప్రదేశంలో ఆ కుర్రాడు మొదట చూసిన అందమైన అమ్మాయి తన కారు పాడై బాధ పడుతూ ఉంటుంది. తనకు కొంచెం సహాయం చేసినందుకే ఆ కుక్క అతడికే తెలియకుండా ఆ కుర్రాడికి చాలా పెద్ద పెద్ద సహాయాలు చేసింది. సహాయం ఎంత చిన్నది అయినా మరువవద్దు అనే జీవిత సత్యం బోధిస్తుంది ఈ వీడియో. నచ్చితే షేర్ చేయండి.

(Visited 847 times, 1 visits today)