Home / Inspiring Stories / దొంగా పోలీసూ కాదు దొంగే పోలీస్.

దొంగా పోలీసూ కాదు దొంగే పోలీస్.

Author:

కొన్ని సార్లు అంతే పొద్దున్నే ఆఫీసుకి బయల్దేరేటప్పుడు అవసరమైందేదో తెమ్మని భార్యామణి చెప్పిన సంగతి మళ్ళీ సాయంత్రం తిరిగి  ఇంట్లో కొచ్చాకో లేదా కొనాల్సిన వస్తువు ఉండే షాపు దాటాకో గుర్తొస్తుంది… పాపం ఆవిడకి కాస్త కోపమెక్కువనుకోండి కూరల్లో హటాత్తుగా కారం,పప్పులో ఉండాల్సిన ఉప్పు అసల్లెకపోవటమో, పస్తులుండాల్సి రావటమో (ఏంటా అనుమానం చూపు పస్తులంటే ఏదో అర్థం చేస్కోవాలి గానీ….) జరగొచ్చు.

పాపం ఈ పోలీసు గారి పరిస్తితేమిటో గానీ దొంగా పోలీస్ ఆట ఆడాడు ఇంట్లో అసలే రాత్రి ఒంటిగంట ఇంటికి వెళ్తూంటే బల్బు కొనటం మర్చిపోయానని గుర్తొచ్చిందో బల్బు పగలటం గుర్తొచ్చిందో గానీ (అబ్బా…! ఆయన ది కాదు పాత అరెంటు బల్బండీ).రోడ్డుపక్కనే పక్కనే ఉన్న షాపు ముందు వెలుగుతున్న రెండు బల్బులనీ ఎంచక్కా కొట్టేసాడు ఐతే పాపం ఈ పోలీసాయనకి దొంగతనం లో అనుభవం లేనట్టుంది (ఐనా ఎవడి పనిలో వాడే ఎక్స్పర్టుమరి) అక్కడ సీసీ కెమెరా ఉందనీ అందులో తాను క్లియర్ గా కనిపిస్తాననీ తట్టలేదు పాపం..

(Visited 96 times, 1 visits today)