Home / Devotional / ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని దానాలు ఇవే.

ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని దానాలు ఇవే.

Author:

దానం.. ఎప్పుడు ఎవరికీ చేసినా మంచిదే. లేని వారికి ఉన్నవారు ఎంతో కొంత, ఎదో ఒక రూపం లో చేసే సహాయం వల్లే మనిషి ఆత్మకి సంతృప్తి దొరుకుతుంది. కుల మతాలతో సంభందం లేకుండా అందరూ అలవర్చూకోవాల్సింది దాన గుణమే. అన్ని దానాల్లోకి అన్న దానం గొప్పదని తెలిసిందే. విద్యా దానాన్ని మించినది లేదంటారు పెద్దలు. అవసరార్థం రక్త దానమో, అవయవ దానమో చేస్తే అంతకన్నా మహాభాగ్యం ఉండదు. దానం చేస్తే సద్గాతులు ప్రాప్తిస్తాయని పండితుల ఉవాచ. ఇవన్నీ చేయాల్సిన దానాలే కానీ కొన్ని ఎట్టి పరిస్తితుల్లోకూడా చేయకూడని దానాలు కూFఆ ఉన్నాయట. తెలిసి చేసినా, తెలియక చేసినా ఈ దానాలు చేస్తే మన కొంప మునిగే ప్రమాదముందట. కాబట్టి కింద తెలిపే దానాల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళకండని పండితులు హెచ్చరిస్తున్నారు.

Don't donate these things

  • చెడిపోయిన లేదా తినడానికి పనికిరాని ఆహారాన్ని ఎత్తి పరిస్థితుల్లో దానం చేయకూడదు. ఇలాంటి ఆహారాన్ని దానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఎంత సంపాదించినా, వచ్చింది వచ్చినట్టు కర్పూరంలా కరిగిపోతుందట.
  • చినిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిగిపోయిన కుర్చీలనూ దానం చేస్తే దురదృష్టం వెంటాడి అన్ని అపజయాలే ఎదురవుతాయి. అసలు మనకి పనికిరాని వస్తువు ఇంకెవరికీ దానం చేయరాదట.
  • చీపుర్లు దానం చేసినవారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. లక్ష్మీదేవిగా భావించే చీపురును దానం చేయడమంటే చేజేతులా లక్ష్మీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లేనట.
  • ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడమే కాదు, బదులుగా ఇచ్చినా కూడా కెరీర్ నాశనమైపోతుందట.
  • సూది, కత్తెర, కత్తులు లాంటివి దానం చేస్తే ఏరి కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట . ఇవి దానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి, జీవితంలో వారికి ఏదీ కలిసిరాదట.
(Visited 7,209 times, 1 visits today)