Home / health / చల్లని నీరు త్రాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రమాదం గురుంచి తెలుసా?

చల్లని నీరు త్రాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రమాదం గురుంచి తెలుసా?

Author:

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచంలో ఎంత ధనవంతుడైన, ఎంత తెలివి ఉన్నవాడైన, ఎంత అందగాడైన  ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని ఉన్న ఎందుకు పనికరావు. అందుకే మనిషికి తన జీవితంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసింది ఆరోగ్యానికే…చాలా మంది ఆహారం తినే ముందో లేదా తిన్న తర్వాత చల్లటి నీరు ఎక్కువగా త్రాగుతుంటారు. అలా త్రాగడం శరీరానికి మంచిది కాదు అని మీకు తెలుసా ?

dont drink cold water

మన పొట్టలో ఎప్పుడు మన శరీర ఉష్ణోగ్రత కంటే  కాస్త ఎక్కువగా  వేడి (జఠరాగ్ని)  ఉంటుందట!. అలా ఉండాలి కూడా అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలా శరీరంలో వేడి ఉండటం వలనే మనం తిన్న ఆహరం జీర్ణం అవుతుంది. జీర్ణ క్రియ సులభంగా జరగాలంటే మన పొట్టలో కచ్చితంగా మినిమమ్ టెంపరేచర్ (జఠరాగ్ని) ఉండాలి.

భోజనం చేయగానే  లేదా మామూలుగానే చల్లని నీరు త్రాగడం వలన పొట్ట లోపల ఉష్ణోగ్రత తగ్గిపోతుంది దానివలన పొట్టలోని ప్రేగులు, కణాలు, నాడులు అన్ని స్థబ్దుగా ఉండిపోతాయి. అవి మామూలు స్థితికి రావడానికి దాదాపు 15-20 నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో మన జీర్ణక్రియ ఆగిపోయి తీసుకున్న ఆహారం అరగక పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాగే విషాలు కూడా తయారు అవుతాయి.

అందుకే మామూలు ఉష్ణోగ్రతతో ఉన్న నీరు లేదా గోరు వెచ్చటి నీటిని తాగడమే మేలు అంటున్నారు నిపుణులు. గోరు వెచ్చటి నీరు తాగడం వలన ఆ వేడికి పొట్టలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అన్నం తిన్న తరవాత కనీసం రెండు గంటల తరవాత నీరు తాగాలి లేదంటే కొద్దిగా గోరు వెచ్చటి నీరును తాగాలి.  వేడి నీరు తాగే సమయంలో ఎక్కువగా వేడి ఉండే నీరు త్రాగినా ప్రమాదమే. ఎందుకంటే ఎక్కువ వేడిని కడుపులో ఉండే లివర్, ప్రేగులు తట్టుకోలేవు. కానీ కొన్ని సంధర్బాలలో (వ్యాయామం చేసి శరీరం వేడెక్కినప్పుడు, జ్వరం వచ్చి శరీరం వేడెక్కినప్పుడు, వేసవి కాలం శరీర ఉష్ణోగ్రత ఎక్కువయినప్పుడు) చల్లని నీరు త్రాగవచ్చు.

(Visited 5,163 times, 1 visits today)