Home / health / ఖాళీ కడుపుతో ఈ పదార్దాలు తింటే చాలా ప్రమాదం.

ఖాళీ కడుపుతో ఈ పదార్దాలు తింటే చాలా ప్రమాదం.

Author:

కొందరు ఉదయం లేవగానే కడుపులోకి ఎదో ఒకటి తోసేస్తూ ఉంటారు. అలా ఏది పడితే అది ఖాళి కడుపుతో తింటే తరువాత మెడిసిన్స్ వాడాల్సిందే అంటున్నారు డాక్టర్లు. ఆహరం ఒక పద్ధతిలో తింటే మనకు ఆరోగ్యాన్నిస్తుంది లేదంటే ఆ ఆహారం బదులు మందులు తినాల్సొస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కొందరికి పరగడుపునే టమాటో జ్యూస్ తాగే అలవాటుంటుంది .. వెంటనే మానేయమంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే పొద్దున్నే టమోటా జ్యూస్ తాగితే మేలు కంటే కీడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందట. నిజానికి టమోటాల్లో ఆకలిని పెంచే గుణం ఉంది. అందుకే భోజనానికి ముందు టమోటా‌ను సూప్‌గా తీసుకుంటారు. అలా తినే ముందు ఓకే కానీ, భోజనానికి ముందు కాకుండా ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్‌ మాత్రం తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమోటాల్లోని టానిక్‌ యాసిడ్‌లు ఎసిడిటీని పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. దాంతో జీర్ణ సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.

tomato soup and bananas

ఇంకొందరికి లేవగానే ఒక అరటి పండు తినేయడం అలవాటు. కానీ శరీరంలో మెగ్నీషియం శాతం ఎక్కువైతే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. అందులోనూ అరటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పరగడుపున దీన్ని తీసుకుంటే శరీరంలో మెగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగి, గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. అయితే భోజనానికి ముందుగానీ, ఆ తర్వాతగానీ అరటి పండు తింటే మంచి ఫలితం ఉంటుందట. కానీ ఖాళి కడుపుతో మాత్రం తినొద్దు. సో పరగడుపునే అరటి పండు, టమాటో సూప్ అలవాటు ఉంటె వెంటనే మానేయండి. అలాగే స్వీట్స్ లాంటివి కూడా ఉదయాన్నే ఖాళి కడుపుతో తినకూడదు.. పరగడుపున తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో చక్కెరస్థాయి పెరగడంతో క్లోమగ్రంథి మీద అదనపు భారం పడుతుంది. దీంతో డయాబెటిస్‌కి దారితీసే అవకాశాలు ఎక్కువవుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి పై అలవాట్లుంటే మానుకోండి.

(Visited 1,624 times, 1 visits today)