Home / Political / సర్వీస్ చార్జ్ కట్టండి, లేకపొతే మా రెస్టారెంట్లలో తినకండి: భారతీయ రెస్టారెంట్ల అసోషియేషన్.

సర్వీస్ చార్జ్ కట్టండి, లేకపొతే మా రెస్టారెంట్లలో తినకండి: భారతీయ రెస్టారెంట్ల అసోషియేషన్.

Author:

ఈరోజుల్లో జనాలు ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్తితి. భోజనాన్ని సాదరణం కంటే అధిక ధరలకు అమ్మడమే కాకుండా ఫైనల్ బిల్ పై రెస్టారెంట్ ని బట్టీ 5 నుండి 20% వరకు సర్వీస్ చార్జ్ రూపంలో వసూలు చేస్తారు. రెస్టారెంట్ల దోపిడీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు పెరుగడంతో స్పందించిన భారతీయ వినియోగదారుల వ్యవహారాల శాఖ. అసలు రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ తప్పనిసరిగా కట్టాలనే నిభందన ఏది చట్టంలో లేదని, కేవలం రెస్టరెంట్ వారి సర్వీసు నచ్చి మీకు ఇష్టమైతేనే మీరు సర్వీసు చార్జ్ కట్టొచ్చని తెలిపింది. మీకు ఆ రెస్టారెంట్ యొక్క సర్వీసు నచ్చనట్లైతే మీరు సర్వీసు చార్జ్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇలా కాకుండా ఎదైనా రెస్టారెంట్ వారు సర్వీసు చార్జ్ తప్పనిసరిగా కట్టాలని ఒత్తిడి చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

pay-service-charge-or-dont-eat
ప్రభుత్వ నిర్ణయంపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) మండిపడింది. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మెరుగైన సేవలు కావాలనుకొనేవారు తప్పనిసరిగా సర్వీసు చార్జ్ కట్టాల్సిందేనని లేకపోతే అన్ని సదుపాయాల్ని అందించలేమని తెలిపింది. ఇకనుండి ప్రతి రెస్టారెంట్ ముందు ఆ రెస్టారెంట్ లో ఎంత సర్వీసు చార్జ్ వసూలు చేస్తారనేది చూపిస్తామని కస్టమర్లు తమకు ఇష్టమైతేనే ఆ రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేయోచ్చని లేదంటే తమ బడ్జెట్ లో ఉండే రెస్టారెంట్ కి వెళ్ళీ భొజనం చేయాలని తెగేసి చెప్పింది అంతేకాని అన్ని సదుపాయాలను వాడుకొని చివరకు సర్వీసు చార్జ్ చెల్లించమంటే మాత్రం ఊరుకోమని ప్రకటించింది NRAI. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేసే పనిలో ఉన్నాయి పలు రెస్టారెంట్లు.

(Visited 292 times, 1 visits today)